అన్వేషించండి

Minister KTR : నేతన్నలపై కక్ష కట్టిన కేంద్రం, చేనేతపై పన్ను విధించిన తొలి ప్రధాని మోదీ- మంత్రి కేటీఆర్

Minister KTR : నేతన్నలపై కేంద్రం కక్షసాధిస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించిందన్నారు.

Minister KTR : చేనేత వస్త్రాలపై పన్ను విధించిన తొలి ప్రధాని మోదీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలోని నేతన్నలతో మంత్రి టెలికాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. చేనేత, టెక్స్ టైల్ రంగానికి తీరని ద్రోహం చేస్తున్న బీజేపీకి మునుగోడు నేతన్నలు గట్టిగా బుద్ధి చెప్పాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నేతన్నల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నేతన్నలకు గుర్తింపు, గౌరవం లభించిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడాదికి రూ.1200 కోట్ల భారీ నిధులను బడ్జెట్లో కేటాయిస్తూ వస్తున్నామని కేటీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా భారీగా యార్న్ సబ్సిడీ చేనేత మిత్ర పథకం ద్వారా అందిస్తున్నామని స్పష్టం చేశారు. నేతన్నకు చేయుత పొదుపు కార్యక్రమం ద్వారా చేనేత కార్మికుల పొదుపు మొత్తానికి రెట్టింపుగా ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. రైతు బీమా మాదిరే నేతన్నల కోసం ఐదు లక్షల బీమా సదుపాయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నారాయణపేటలో ఇంటిగ్రేటెడ్ చేనేత అభివృద్ధి కేంద్రంతోపాటు గద్వాలలో చేనేత పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ నేతన్నలకు తెలిపారు. 

నేతన్నలపై కేంద్రం కక్ష 

టీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్న కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తుంటే కేంద్రం మాత్రం నేతన్నలపైన కక్ష కట్టిందని కేటీఆర్ ఆరోపించారు. దేశ చరిత్రలో ఏ ప్రధాని చేనేత వస్త్రాల పైన పన్ను వేయలేదని, కానీ బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధించిందన్నారు. ప్రస్తుతమున్న ఐదు శాతం జీఎస్టీని 12 శాతానికి పెంచే కుట్రలు కూడా బీజేపీ చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. స్వదేశీ మంత్రంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చేనేత పరిశ్రమ పూర్తిగా దివాళా తీసేలా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డ్, చేనేతల పొదుపు పథకం, చేనేతలకు ఉన్న బీమా పథకం, చేనేతల హౌస్ కం వర్క్ షెడ్ వంటి కీలకమైన సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసి చేనేత పట్ల మోదీ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. చేనేతలకు ఇచ్చే యార్న్ సబ్సిడీలను 40% నుంచి 15 శాతానికి తగ్గించి చేనేత వస్త్రాల ఉత్పత్తిపై కేంద్రం చావుదెబ్బ కొట్టిందన్నారు. 

బీజేపీకి బుద్ధి చెప్పాలి

తెలంగాణ ప్రభుత్వం చేనేతల కోసం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సాయం అడిగితే ఇప్పటిదాకా మోదీ ప్రభుత్వం స్పందించలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కొరితే స్పందన లేదన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, బ్లాక్ లెవెల్ హ్యాండ్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు వంటి విషయాల్లో  కేంద్ర ప్రభుత్వం నుంచి నిరాశనే ఎదురైందని కేటీఆర్ మండిపడ్డారు. అన్ని రంగాల్లో చేనేత కార్మికుల జీవితాలను చీకట్లలోకి తోస్తున్న మోదీ ప్రభుత్వానికి, బీజేపీకి మునుగోడు ఉపఎన్నిక ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని కేటీఆర్ మునుగోడు నేతన్నలకు విజ్ఞప్తి చేశారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెం, పుట్టపాక, గట్టుపల్, చౌటుప్పల్, చండూరు, మునుగోడు, నారాయణపురం, లింగోటం వంటి కేంద్రాలలో ఉన్న నేతన్నల సంక్షేమం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు.  

టాప్ హెడ్ లైన్స్

సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Embed widget