అన్వేషించండి

Boora Narsaiah: బూర నర్సయ్యతోపాటు మరో ముగ్గురు బీజేపీలోకి - ఆ నేతలు ఎవరంటే!

నేడు మధ్యాహ్నం 12 గంటలకు బూర నర్సయ్య గౌడ్ బీజేపీ కండువా కప్పుకుంటారు. ఇందుకోసం బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు ఢిల్లీ వెళ్లారు.

మునుగోడు ఉప ఎన్నికల ఊపులో బీజేపీలో చేరుతున్నట్లుగా టీఆర్ఎస్ నేత బూర నర్సయ్య గౌడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయనతో పాటు బీజేపీలోకి మరో ఇద్దరు నేతలు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బుధవారం (అక్టోబరు 19)న బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన బీజేపీ కండువా కప్పుకునే సమయంలోనే కాంగ్రెస్‌ నేత వడ్డేపల్లి నర్సింగ్‌రావు కుమారుడు కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన వడ్డేపల్లి రాజేశ్వర్‌రావు, వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ (మాజీ ఎమ్మెల్యే నారాయణ్‌ రావు సోదరుడు) కుమారుడు నరేశ్‌ ముదిరాజ్‌తో పాటు మహబూబ్‌నగర్‌కు చెందిన మరో లీడర్ కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. నేతలు బీజేపీలో చేరే ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, ఇతర నేతలు హాజరు అవనున్నారు.

బుధవారం (అక్టోబరు 19) మధ్యాహ్నం 12 గంటలకు బూర నర్సయ్య గౌడ్ బీజేపీ కండువా కప్పుకుంటారు. ఇందుకోసం బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు ఢిల్లీ వెళ్లగా, ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. బీజేపీలో చేరిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మరోసారి బూర నర్సయ్య గౌడ్ కలవనున్నట్లు తెలుస్తోంది. 

కేసీఆర్ బూర అసంతృప్తి
మునుగోడు ఉప ఎన్నిక విషయంలో తనను పార్టీ సంప్రదించలేదని బూర నర్సయ్య గౌడ్ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మునుగోడు టికెట్ ను ఆశించారు. కానీ, సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ పార్టీని వీడి బయటకు వచ్చారు. తనకు పార్టీలో అవమానం జరిగిందని, తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదంటూ అందుకే రాజీనామా చేసినట్లు బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. ఇదిలా ఉంటే బూర నర్సయ్య గౌడ్ కు టీఆర్ఎస్ పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందని ఆయన పార్టీని వీడడం వల్ల టీఆర్ఎస్ కి వచ్చిన నష్టం ఏమీ లేదని గులాబీ నేతలు అంటున్నారు.

టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్ కు బూర నర్సయ్య గౌడ్ కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమం, పార్టీ ప్రస్థానంలో తాను పోషించిన కీలక పాత్ర గురించి లేఖలో ప్రస్తావించారు. 2019లో ఎంపీగా ఓడిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. 2013 సంవత్సరంలో టీఆర్‌ఎస్‌లో చేరిన బూర నర్సయ్య గౌడ్ 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆశించారు. కానీ, అది కూడా లేకపోవడంతోనే బూర కొన్నాళ్లుగా అసహనంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Moosi politics: మూసీ ప్రక్షాళన రాజకీయాల్లో బీఆర్ఎస్ అగ్రెసిస్ ఎటాక్ - కాంగ్రెస్ డిఫెన్సివ్ గేమ్ - ఎవరిది పైచేయి?
మూసీ ప్రక్షాళన రాజకీయాల్లో బీఆర్ఎస్ అగ్రెసిస్ ఎటాక్ - కాంగ్రెస్ డిఫెన్సివ్ గేమ్ - ఎవరిది పైచేయి?
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Raja Singh: రాజాసింగ్ రివర్స్ గేర్ - ఆవేశంతో బీజేపీ రాజీనామా.. అనివార్యంతో రీ-ఎంట్రీ!
రాజాసింగ్ రివర్స్ గేర్ - ఆవేశంతో బీజేపీ రాజీనామా.. అనివార్యంతో రీ-ఎంట్రీ!
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel-Iran War: గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
Pradeep Ranganathan: టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
US Israel Iran War:
"ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుఎస్-ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది" యుఎఇపై మాజీ రాయబారి కామెంట్స్ 
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Honda Dio 125 కొనబోతున్నారా? స్టాండర్డ్, X ఎడిషన్, DLX వేరియంట్ల ధరలు, ఫీచర్లు పూర్తి వివరాలు
హోండా డియో 125 స్కూటర్‌ వేరియంట్లు, ధరలు ఇవే - ఏ మోడల్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Embed widget