Tummala Nageswararao : నీతి మాలిన రాజకీయాలు చేయను, పార్టీ మార్పుపై తుమ్మల క్లారిటీ!
Tummala Nageswararao : పార్టీ మార్పుపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయన్నారు.
Tummala Nageswararao : మాజీ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్యనేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారతారనే సందేహాలపై కార్లిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ తోనే తన రాజకీయ జీవితం అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ వల్లే ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా ఉందన్నారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయని, తాను నిజాయితీగా ఉంటానన్నారు. నీతిమాలిన రాజకీయాలు చేయనని తుమ్మల స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. సీతారామ ప్రాజెక్టు కోసమే సీఎం కేసీఆర్ తో ఉంటున్నానన్నారు.
పార్టీ మార్పుపై ప్రచారం
అయితే తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల టీఆర్ఎస్ పార్టీతో కాస్త దూరం జరిగారు. దీంతో ఆయన పార్టీ మారతారా అనే ప్రచారం జోరుగా సాగాయి. గురువారం తన అభిమానులతో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీంతో తుమ్మల పార్టీ మార్పు పక్కా అంటూ ప్రచారం స్పీడ్ అందుకుంది. తుమ్మలతో కాంగ్రెస్, బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై తుమ్మల నాగేశ్వరరావు స్పష్టత ఇచ్చారు. సీఎం కేసీఆర్ తోనే ఉంటున్నానన్నారు. ములుగు జిల్లా వాజేడులో తన అభిమానులతో తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేశారు. గురువారం ఉదయం భద్రాద్రి రామయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తుమ్మల, 350 కార్లతో ర్యాలీగా వాజేడుకు వెళ్లారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుమ్మల అనుచరులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొట్టిన వేళ ఈ సమావేశం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనంపై టీఆర్ఎస్ అధిష్ఠానం కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ వెంటే
ఈ ప్రచారాల మధ్య పార్టీ మార్పుపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టత ఇచ్చారు. సీఎం కేసీఆర్ వెంటే తాను ఉంటానని పేర్కొన్నారు. ములుగు జిల్లా వాజేడులో గురువారం అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో మనం పని చేయాల్సిన అవసరం ఉందని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుచరులకు తుమ్మల సూచించారు. రాజకీయాల్లో ఒడిదొడుగులు సహజమే అన్న ఆయన.. రాబోయే రోజులు మనవే అన్నారు. ఎవరు అధైర్య పడొద్దని, ఆందోళన చెందొద్దని తన అభిమానులతో అన్నారు. 40 ఏళ్లు రాజకీయంగా ఎలా ఉన్నానో రాబోయే రోజుల్లో కూడా అలానే ఉంటానన్నారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. మనకు మేలు చేసే వ్యక్తులనే మనం ఆదరించాలన్నారు. తాత్కాలిక అవసరాల కోసం నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు వస్తాయని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పార్టీ మార్పుపై జరిగిన ప్రచారాలకు తుమ్మల బ్రేక్ వేశారు. తాను టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.
Also Read : TRS BC Card : గంగుల కమలాకర్, గాయత్రి రవిలపై ఈడీ ఎటాక్స్ బీసీ ఆత్మగౌరవంపై దాడే - టీఆర్ఎస్ ఆగ్రహం !