TRS BC Card : గంగుల కమలాకర్, గాయత్రి రవిలపై ఈడీ ఎటాక్స్ బీసీ ఆత్మగౌరవంపై దాడే - టీఆర్ఎస్ ఆగ్రహం !
బీసీ నేతలపై ఐటీ దాడులు వారి వర్గంపై కక్ష సాధింపేనని టీఆర్ఎస్ బీసీ నేతలు మండి పడ్డారు. బీసీలు బీజేపీకి బుద్ది చెబుతారన్నారు.
TRS BC Card : తెలంగాణలో రెండు రోజులుగా సాగుతున్న ఈడీ, ఐటీ దాడులపై టీఆర్ఎస్ మండిపడింది. బీసీ నేతలను టార్గెట్‌గా చేసుకుని ఈ దాడులు చేస్తున్నారని టీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతలు దానం నాగేందర్, జాజుల సురేందర్ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పించారు. బాజి రెడ్డి గోవర్ధన్ , గంగుల కమలాకర్, వద్ది రాజు రవి చంద్ర ల పై ఈడీ ,ఐటీ దాడులు దుర్మార్గమని.. మునుగోడు లో వారిద్దరూ టీ ఆర్ ఎస్ గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు కనుకే బీజేపీ టార్గెట్ చేసిందన్నారు. బీసీ ల వ్యతిరేక పార్టీ బీజేపీ అని మరో మారు రుజువు అయింది...బీజేపీ డీ ఎన్ ఏ లోనే బీసీ వ్యతిరేకత ఉందని విమర్శించారు. బీసీ లకు మండల్ కమిషన్ రిజెర్వేషన్ లు ఇవ్వాలనుకుంటే బీజేపీ కమండల్ యాత్ర తో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందనిారోపించారు.
టీ ఆర్ ఎస్ నుంచి బీసీ నాయకులను దూరం చేసే కుట్ర కు బీజేపీ పాల్పడుతోందని బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా బీసీ నేతలు లొంగే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు. .బీజేపీ చేష్టలను గట్టిగా ప్రతిఘటించి తీరుతామన్నారు. బీసీ గణన చేయమంటే చేయరు బీసీ మంత్రిత్వ శాఖ వేయరు.. కానీ బీసీ నాయకులను వేధిస్తారా.. అని మండిపడ్డారు. బీజేపీ ఆటలు తెలంగాణ లో సాగవన్నారు. ed ,ఐటీ లకు బీజేపీ తప్ప ఇతర పార్టీ నేతలే కనిపిస్తున్నారు. బీసీ నేతలు ఆత్మగౌరవం తో బతికే వారు.. అందుకే బీజేపీ వారిని దెబ్బ తీయాలని చూస్తోంది..మునుగోడు లో టీ ఆర్ ఎస్ విజయాన్ని తట్టుకోలేకే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని టీఆర్ఎస్ బీసీ నేతలు విమర్శలు గుప్పించారు. రాజకీయంగా బీసీ లను తొక్కే కుట్ర బీజేపీ దన్నారు.
బీజేపీ బీసీ ల పై చేస్తున్న దాడులను దేశం దృష్టి కి తీసుకెళ్తామమని టీఆర్ఎస్ ప్రకటించింది. అవసరమైతే brs ఇతర పార్టీలను కలుపుకుని బీసీ ల పై ed, it దాడులపై పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ కుట్రలు ఆపకపోతే బీసీ ల ఆగ్రహానికి గురికాక తప్పదని నేతలు హెచ్చరించారు. బీజేపీ పై దేశం లో పోరాడే సత్తా ఉన్న బలమైన నేత కేసీఆర్ ..అందుకే టీ ఆర్ ఎస్ ను ed, it లతో బలహీన పరిచే కుట్ర జరుగుతోందన్నారు. బీసీ వ్యాపార వేత్తలను రాజకీయంగా ఎదగకుండా బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. గంగుల కమలాకర్, రవిచంద్ర రాజకీయాలోకి రాక ముందు నుంచే వ్యాపారాల్లో ఉన్నారని గుర్తుచేశారు. బీజేపీ వ్యాపారస్తులు ed, it లకు కనిపించరా అని ప్రశ్నించారు. ews రిజర్వేషన్లు 10 శాతం పెంచారు సరే.. మరి బీసీ జనగణన ఎపుడు చేస్తారంటే కేంద్రం ఏమి చెప్పదననారు.
కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీ కి బుద్ది చెబుతామని టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. కేసీఆర్ పాలన లో బీసీ లు ఎదగడం బీజేపీ కి ఇష్టం లేదని.. పీఎం మోడీ పర్యటన పై నిరసనలు వ్యక్తమవుతున్నాయని డై వర్షన్ రాజకీయాలు చేస్తోందన్నారు. గ్రానైట్ వ్యాపారులయిన మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ గాయత్రి రవి ఇళ్లు, కార్యాలయాలతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. అయితే గ్రానైట్ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదని.. ఈడీకి ఏం సంబంధమని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.