By: ABP Desam | Updated at : 06 Jan 2023 07:39 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
అదుపుతప్పిన బస్సు
Mulugu News : ములుగు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాణిపాకం నుండి తీర్థయాత్రలు చేస్తూ యాదగిరిగుట్ట వెళ్తోన్న భవానీ దీక్షదారుల బస్సుకు రోడ్డు ప్రమాదం తప్పింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అంకన్నగూడెం వద్ద బస్సు అదుపుతప్పింది. ఏపీ చిత్తూరుకు చెందిన 45 మంది భవానీ మాలలు ధరించిన భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థ యాత్రలు చేస్తూ భద్రాచలం దర్శనం చేసుకొని వెంకటాపురం మీదుగా యాదగిరిగుట్ట వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు అంకన్నగూడెం వద్దకు రాగానే డ్రైవర్ కు సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా డ్రైవర్ ను వెంకటాపురం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే డ్రైవర్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
అసలేం జరిగింది?
ములుగు జిల్లా వెంకటాపురం తీర్థయాత్రలకు వెళ్తున్న ప్రైవేటు టూరిస్ట్ బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో బస్సు రోడ్డు పక్కకు నిలిపివేశాడు. 45 మందితో వెళ్తున్న టూరిస్టు బస్సు డ్రైవర్ కు గుండె నొప్పితో ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అయినా కూడా ప్రయాణికులను కాపాడేందుకు బస్సును రోడ్డు పక్కన నిలిపి వారి ప్రాణాలను కాపాడాడు. డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించే క్రమంలోనే అతడు మృతి చెందాడు. ఈ సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం - వీరభద్రవరం మధ్య శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన 45 మంది భవానీ మాలదారణ భక్తులను తీసుకొని ప్రైవేటు టూరిస్టు బస్సులో డ్రైవర్ తెలంగాణలోని భద్రాద్రికి వచ్చారు. అక్కడి నుంచి బయలుదేరి వెంకటాపురం మండలం మీదుగా యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి దర్శనం కోసం బయలుదేరారు. ఈ క్రమంలో అంకన్నగూడెం- వీరభద్రవరం గ్రామాల మధ్య డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్తుండగా ప్రాణపాయ స్థితిలో ఉన్న డ్రైవర్ ప్రమాదం జరుగకుండా బ్రేకులు వేసి నిలిపివేశాడు. వెంటనే డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రయాణికులు గమనించి 108కు సమాచారం ఇవ్వగా వెంటనే వెంకటాపురం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు. గుండె నొప్పితో తీవ్రంగా బాధపడుతూ కూడా 45 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి తాను మృత్యు ఒడికి వెళ్లిన డ్రైవర్ కు ప్రయాణికులు చేతులెత్తి దండం పెట్టి విలపించారు. డ్రైవర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంకటాపురం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
స్విగ్గీ ఏజెంట్ ను కారుతో ఢీకొట్టి
ఢిల్లీలోని కంజావాలా హిట్ అండ్ రన్ కేస్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అలాంటి ఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది. నోయిడాలో ఓ కార్ టూవీలర్‌ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న స్విగ్గీ ఏజెంట్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఢీకొట్టిన తరవాత దాదాపు 500 మీటర్ల వరకూ కార్..బైక్‌ని లాక్కెళ్లిందని పోలీసులు వెల్లడించారు. "స్విగ్గీ ఏజెంట్ కౌశల్...ఫుడ్ డెలివరీ కోసం బయటకు వచ్చాడు. నోయిడా సెక్టార్ 14 వద్ద ఓ కార్ వేగంగా వచ్చి ఢీకొట్టింది" అని వివరించారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం...బైక్..కార్‌కు చిక్కుకుంది. కొంత దూరం వరకూ కార్ డ్రైవర్ అలానే ముందుకు వెళ్లాడు. కార్‌లో బాధితుడు చిక్కుకున్నాడు. కాసేపయ్యాక ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అప్పుడు కానీ డ్రైవర్ కార్ ఆపలేదు. అప్పటికే కౌశల్ మృతి చెందాడు. మృతుని వయసు 24 ఏళ్లు అని పోలీసులు నిర్ధరించారు. అర్ధరాత్రి 1 గంటకు కౌశల్‌కు తన సోదరుడు కాల్ చేశాడు. అప్పటికే కౌశల్ ప్రాణాలు కోల్పోయాడు. యాక్సిడెంట్ స్పాట్‌లో ఉన్న ఓ వ్యక్తి కాల్ అటెండ్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. కాసేపటికి పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. "యాక్సిడెంట్ స్పాట్ పరిసరాల్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. నిందితుడిని పట్టుకుంటాం" అని పోలీసులు వెల్లడించారు.
Telangana 3వ స్థానంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ యూపీకి చివరి స్థానం: మంత్రి హరీష్ రావు
Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం
SI Constable Marks : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
Breaking News Live Telugu Updates: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నొవాక్ జకోవిచ్
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !
Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు