అన్వేషించండి

Telangana Municipal Elections 2026: కేటీఆర్ తీరుతో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి నష్టం.. సీఎం కూడా లైట్ తీసుకున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

Telangana Municipal Polls 2026 | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ వాడే భాషను, ఆయన ప్రవర్తనను తప్పుపట్టారు.

Telangana Politics | హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం అయిందని, అందుకు అసహనంతో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర ఏముందని ప్రశ్నిస్తూనే, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో సిరిసిల్లలో సైతం కేటీఆర్ రాజకీయ భవిష్యత్ ముగిసినట్లే అని కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ తీరు వల్లే కేసీఆర్ రాజకీయంగా నష్టపోయారని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్‌ను వెనక్కి లాగింది కేటీఆరేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. తండ్రి సంపాదించిన అధికారం, ధనంతో కేటీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బజారు రౌడీల కంటే హీనంగా కేటీఆర్ భాష ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తండ్రి పేరుతో బతికే వ్యక్తికి అహంకారం పనికిరాదు..

ఫోన్ ట్యాపింగ్‌లు, ఇతర అక్రమ పనులకు పాల్పడుతూ ఇంకా తానేదో పెద్ద నాయకుడినని కేటీఆర్ భ్రమ పడుతున్నారని దయాకర్ ఎద్దేవా చేశారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారని, ఇలాగే పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు ఊరుకోరని, తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను గానీ, కేటీఆర్‌ను గానీ అసలు పట్టించుకోవడం లేదని, కేటీఆర్ తన పార్టీని తనే అంతం చేసుకుంటున్నారని విమర్శించారు. తండ్రి పేరు చెప్పుకుని బతికే వ్యక్తికి ఇంత అహంకారం పనికిరాదని, చేసేవన్నీ సిగ్గుమాలిన పనులు చేస్తూ ఇంకా నీతులు చెప్పడం హాస్యాస్పదమని అద్దంకి దయాకర్ దుయ్యబట్టారు.

సిరిసిల్లలో కేటీఆర్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది.. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించబోతున్నారని, తన సొంత నియోజకవర్గంలో పట్టు కోల్పోతుండటంతోనే కేటీఆర్ అసహనంతో సీఎం రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటున్నారని బల్మూర్ వెంకట్ విమర్శించారు. కేటీఆర్ రాజకీయ జీవితం క్లైమాక్స్‌కు చేరుకుందని, సిరిసిల్లలో ఆయనకు ప్రజలు ఎండ్ కార్డ్ వేయడం ఖాయమని జోస్యం చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర ఏంటని ప్రశ్నించారు. అమెరికాలో అంట్లు కడుక్కునే వ్యక్తిని తీసుకొచ్చి కేసీఆర్ ఇక్కడ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి లాంటి వారిని తొక్కేసి కేటీఆర్ పదవులు పొందారని ఆరోపించారు. గత పదేళ్లలో అధికార బలంతో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, పాస్‌పోర్ట్ బ్రోకర్లు ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఘాటుగా విమర్శించారు.

ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్‌లను గద్దె దించి సీఎం రేవంత్ రెడ్డి పవరేంటో నిరూపించారని బల్మూర్ వెంకట్ అన్నారు. సొంత చెల్లెలు (కవిత) అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కేటీఆర్, సిగ్గు లేకుండా తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తన భాష మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget