MLC Kavitha : ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు - అనారోగ్యం కారణంగా కోర్టు నిర్ణయం
Telangana : ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనారోగ్యంతో బాధపడుతూండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Medical Tests For Kavitha at Delhi AIIMS : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశింిచంది. కవితకు అనారోగ్యంగా ఉండటంతో మంగళవారం ఢిల్లీలోని ధీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్ అందించిన తర్వాత మళ్లీ జైలుకు తరలించారు. దీంతో కవితకు వైద్య పరీక్షల కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతి ఇచ్చింది.
అనారోగ్యంతో బాధపడుతున్న కవిత
కవిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో బాగా బరువు తగ్గారని.. దీర్ఘ కాలిక సమస్యల వల్ల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఆమె తరపు లాయర్లు చెబుతున్నారు. ఎయిమ్స్ లో టెస్టుల తర్వాత ఆ ఫలితాలను బట్టి కొత్తగా అనారోగ్య కారణాలతో బెయిల్ పిటిషన్ ను కవిత దాఖలు చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కవితకు టెస్టులను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయనున్నారు. మార్చి పదిహేనో తేదీన హైదరాబాద్ లో కవితను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. సీబీఐ కూడా ఈ కాలంలోనే అరెస్టు చేసింది. ఇప్పుడు బెయిల్ రావాలంటే రెండు కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంది. కానీ అనారోగ్య కారణాల వల్ల అయితే.. బెయిల్ అన్ని కేసులకూ వర్తించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సుదీర్ఘ కాలంగా జైల్లో నిందితులు
సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈనెల 22 వరకు ట్రయల్ కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అత్యంత కీలక పాత్ర పోషించారని సీబీఐ , ఈడీ రెండూ వాదిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త చార్జిషీట్ల ద్వారా కవిత పాత్రను కోర్టు దృష్టికి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. ఆయనకు ఈడీ కేసులో బెయిల్ లభించినా.. సీబీఐ కేసులో ఇంకా లభించలేదు. ఈ కారణంగా జైల్లోనే ఉన్నారు. సీఎంగా తన విధులను జైలు నుంచే నిర్వహిస్తున్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా ఏడాదికిపైగా జైల్లోనే ఉన్నారు.ఆయనకు కూడా బెయిల్ లభించలేదు. సుదీర్గంగా నిందితులు జైళ్లలో ఉంటున్నా.. కోర్టుల్లో మాత్రం ఊరట లభించడం లేదు.
అప్రూవర్లుగా మారిన వారికి బెయిల్
ఈ కేసులో అప్రూవర్లు అయిన కొంత మందికి మాత్రం బెయిల్ లభించింది. వారిలో ఎక్కువగా సౌత్ లాబీకి చెందిన వారే ఉన్నాు. టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకే అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేశారని.. అది తప్పుడు వాంగ్మూలం అని.. కేజ్రీవాల్ సతీమణి ఆరోపిస్తున్నారు.