Telangana: నేడు నిరుద్యోగ జేఏసీ తెలంగాణ బంద్...మెగా డీఎస్సీ సహా గ్రూప్ ఉద్యోగాలు పెంచాలని డిమాండ్
Telangana Bandh: గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచడంతోపాటు మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన తెలంగాణం బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది
Telangana Bandh: తెలంగాణ(Telangana)లో మళ్లీ చాలా రోజుల తర్వాత విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత సమయం ఇచ్చిన నిరుద్యోగులు మళ్లీ ఉద్యోగాల కోసం రోడ్డెక్కడంతో పాటు తెలంగాణ బంద్(Bandh)కు పిలుపునిచ్చారు.
మెగా డీఎస్సీ కోసం పట్టు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra BabU) మెగా డీఎస్సీ(DSC) ప్రకటించడమేగాక...ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకమే డీఎస్పీపై పెట్టారు. దాదాపు 16వేలకు పైగా పోస్టులతో భారీ ఉద్యోగ నియామకాలకు తెరతీశారు. దీంతో తెలంగాణలోనూ మెగా డీఎస్సీ కోసం నిరుద్యోగులు పట్టుపడుతున్నారు.దీంతోపాటు గ్రూప్-2 (Group-2) పోస్టులు పెంచాలంటూ వారం రోజులుగా గాంధీభవన్(Gandhi Bhavan) వద్ద నిరుద్యోగ జేఏసీ(JAC) నేత మోతీలాల్‌నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేయగా... ఆయన్ను గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital)కి తరలిచంగా...అక్కడి కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు ఆయనకు రాజకీయ నేతలతోపాటు, విద్యార్థిసంఘాలు, యువజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నిరుద్యోగ సంఘాలు నేడు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే నిరుద్యోగ జేఏసీ(JAC) ఇచ్చిన బంద్‌కు పెద్దగా స్పందన లేదని తెలుస్తోంది. పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
జిల్లాల్లోనూ బంద్
రాష్ట్రవ్యాప్తంగా 24వేల పోస్టులతో మెగా డీఎస్సీ(Mega DSC) చేపట్టాలని సూర్యాపేటలో నిరుద్యోగులు కదం తొక్కారు. పాత జాతీయ రహదారిలోని ఫోస్టాపీసు ప్రాంతంలో నిరుద్యోగు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి(Revanth Reddy)..అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదన్నారు.తక్షణం గ్రూప్ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు. గ్రూప్-3 ద్వారా 3వేలు, గ్రూప్-2 రెండువేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఏపీలో మాదిరిగా మెగా డీఎస్సీ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
చర్చలు విఫలం
గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందున్న నిరుద్యోగ జేఏసీ(JAC) నేత మోతీలాల్‌తో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్(Venkat) జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. ముఖ్యమంత్రి నేరుగా ప్రకటన చేస్తేనే దీక్ష విరమిస్తామని తేల్చి చెప్పారు.
నిరుద్యోగుల డిమాండ్లు
గ్రూప్-1 మెయిన్స్ ఎలిబిలిటినీ 1:100కు పెంచడంతోపాటు గ్రూప్-2లో రెండువేలు, గ్రూప్-3లో మూడువేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. మెగా డీఎస్సీతోపాటు గురుకుల టీచర్ల పోస్టుల్లో బ్యాక్‌లాగ్‌లు పెట్టొద్దని డిమాండ్ చేశారు. తక్షణం నిరుద్యోగ భృతి ప్రకటించాలన్నారు.