అన్వేషించండి

Ponnam Prabhakar: నేనేమీ అల‌గ‌లేదు, అందువల్లే గుడి బయట కూర్చున్నాం - ప్రొటోకాల్ వివాదంపై మంత్రి పొన్నం

Balkampet Yellamma Temple: తాను అలిగిన‌ట్లు వ‌చ్చిన వార్తల్లో నిజం లేద‌న్నారు మంత్రి పొన్నం. మ‌హిళ‌లు వెళ్లే స‌మ‌యంలో తోపులాట జ‌రిగింద‌ని అందుకు కాసేపు అలా డివైడర్ పై కూర్చున్నట్లు తెలిపారు.

Ponnam Prabhakar: హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలో ప్రోటోకాల్‌ వివాదం దుమారం రేపడం తెలిసిందే. అధికారుల తీరుపై అలిగిన మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్‌ గద్వాల్ విజయలక్ష్మి గుడి బయటే ఉండిపోయారు. ఎల్లమ్మ తల్లి కల్యాణ వేడుకల‌ ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. ప్రొటోకాల్‌ పాటించడం లేద‌ని అలిగి మంత్రి ఆలయం బయటే కూర్చుండిపోయినట్టు వార్తలు హల్ చల్ చేశాయి.

ఈ విష‌య‌ంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తాను అలిగిన‌ట్లు వ‌చ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేద‌న్నారు. అమ్మవారి భక్తులమైన మేము ఎందుకు అలుగుతామ‌న్నారు. అధికారం, హోదా తోటి రాలేదన్నారు. భక్తులుగా మాత్రమే అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. మ‌హిళ‌లు వెళ్లే స‌మ‌యంలో తోపులాట జ‌రిగింద‌ని పేర్కొన్నారు. దాంతో మేయ‌ర్ విజయలక్ష్మి కూడా తోపులాట‌లో ఇబ్బంది ప‌డ్డార‌ని అన్నారు. తోపులాట‌ను నిలువ‌రించేందుకు కొద్దిసేపు ఆగిన‌ట్లు మంత్రి పొన్నం తెలిపారు. అదే సమయంలో తోపులాట గురించి అధికారులను ప్రశ్నించినట్లు చెప్పుకొచ్చారు. మహిళా రిపోర్టర్‌కు ఎదురైన చేదు అనుభ‌వానికి  క్షమాపణలు తెలిపారు. అలాగే ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు.    

అట్టహాసంగా బోనాలు
చారిత్రాత్మక బోనాల పండగ హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. గోల్కొండ బోనాల జాతరతో సుమారు 45 రోజుల వేడుకలకు శ్రీకారం చుట్టారు. గోల్కొండలో వెలిసిన జగదంబికా అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు.. అమ్మవారికి తొట్టెలు, ఫలహార బండ్లు, రంగం, బలిగంప ఊరేగింపు వంటి కార్యక్రమాలతో జంటనగరాల్లో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది. ఈ నెల 14న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. 21న పాతబస్తీ లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారికి భక్తులు బోనం సమర్పిస్తారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్లను మంజూరు చేసింది. తాజాగా బల్కంపేట్‌లో వెలిసిన ఎల్లమ్మ తల్లికి భక్తులు బోనాలను సమర్పిస్తున్నారు. ఈ తెల్లవారుజాము నుంచే ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు.

బోనం ఎత్తిన మంత్రి కొండా సురేఖ 
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ ఉదయం ఎల్లమ్మ తల్లికి బోనాన్ని సమర్పించారు. సుమారు 40 నిమిషాల పాటు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ, దేవాదాయ మంత్రిత్వ శాఖ అధికారులు, కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ పూజల్లో పాల్గొన్నారు. అధికారులు, ఆలయ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అయినా తోపులాట మాత్రం తప్పలేదు. అమ్మవారికి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు ఎగబడ్డారు. ఫలితంగా క్యూలైన్లల్లో తోపులాట జరిగింది. ఈ ఘటనలోనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కిందపడ్డారు. దీంతో వారు ఆలయం ఎదురుగా రోడ్డు డివైడర్‌పై కూర్చున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   

టాప్ హెడ్ లైన్స్

HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Telangana SIR Process Voter Deletions: తెలంగాణలో పది శాతానికిపైగా ఓట్ల గల్లంతు - కాంగ్రెస్ నేతల వైఫల్యమేనా? హైకమాండ్ ఆగ్రహం ఎందుకు?
తెలంగాణలో పది శాతానికిపైగా ఓట్ల గల్లంతు - కాంగ్రెస్ నేతల వైఫల్యమేనా? హైకమాండ్ ఆగ్రహం ఎందుకు?
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Embed widget