Minister KTR: అమెరికా పర్యటనలో జాప్‌కామ్ గ్రూపుతో కేటీఆర్ ఒప్పందం- హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటుకు అంగీకారం
Minister KTR: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ అక్కడ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. తాజాగా జాప్‌కామ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
Minister KTR: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. అమెరికాకు చెందిన ప్రొడక్స్ ఇంజినీరింగ్ అండ్ సొల్యుషన్స్ కంపెనీ జాప్‌కామ్ గ్రూపుతో ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వాషింగ్టన్ డీసీలో జాప్ కామ్ వ్యవస్థాపకుడు, సీఈవో కిషోర్ పల్లమ్ రెడ్డితో కేటీఆర్ భేటీ అయ్యారు. ట్రావెల్, హాస్పిటాలిటీ, ఫిన్ టెక్, రిటేల్ రంగాల్లో కీలకమైన ఏఐస ఎన్ఎల్పీ ఉత్పత్తులను జాప్ కామ్ కంపెనీ రూపొందించనుంది.
ZapCom Group to set up Center of Excellence in Hyderabad
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2023
ZapCom Group Inc, a US-based Product Engineering and Solutions company, has chosen Hyderabad as the location to establish a Center of Excellence (CoE) specializing in AI and NLP driven products for the Travel and… pic.twitter.com/nba6SN58US
ప్రొడక్స్ ఇంజినీరింగ్ అండ్ సొల్యుషన్స్ కంపెనీ జాప్‌కామ్ కు అమెరికాలో పలు రాష్ట్రాల్లో కేంద్రాలున్నాయి. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడాతో పాటు సెంట్రల్ అమెరికా, ఇండియాలోనూ జాప్ కామ్ కంపెనీకి ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ద్వారా మొదటి దశలో 500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఆ తర్వాతి సంవత్సరంలో మరో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
IT and Industries Minister @KTRBRS led the Aerospace and Defense Roundtable in Washington DC. The event garnered participation from prominent US majors, advisory firms, think tanks, and startups, creating a dynamic platform for discussion and collaboration.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2023
At the roundtable,… pic.twitter.com/ey705UHBqv
During the round table discussion, Minister @KTRBRS proudly shared that Telangana has achieved a remarkable feat by winning the Best State awards for Aerospace for three consecutive years in 2018, 2020, and 2022. Hyderabad was also ranked No 1 Aerospace city of Future in Cost… pic.twitter.com/vaJmvSxdXm
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2023
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మీటింగ్‌లో కేటీఆర్
వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ అసాధారణ ప్రతిభను కనబరిచిందని, వరుసగా మూడేళ్లు అవార్డులను గెలుచుకుందని చెప్పారు. 2018, 2020, 2022 సంవత్సరాల్లో ఏరోస్పేస్ కేటగిరీల్లో తెలంగాణకు బెస్ట్ స్టేట్ అవార్డులు వచ్చినట్లు వెల్లడించారు. ఏరోస్పేస్ సిటీ ఆఫ్ ఫ్యూచర్ కేటగిరీలో హైదరాబాద్ కు నంబర్వన్ ర్యాంకు వచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణకు వస్తున్న అవార్డులు, రాష్ట్రానికి పేరును, గుర్తింపును ఇస్తున్నాయని అన్నారు. ఏరోస్పేస్ రంగంలో రాష్ట్రం దూసుకుపోతోందని ఆయన వెల్లడించారు.
A privilege to have Minister @KTRBRS at USISPF offices in Washington DC for an in-depth conversation with our defense and aerospace members . Telangana as a defense manufacturing and space logistics hub paves the way for stronger🇺🇸🇮🇳 commercial partnership. Thank you @VJS_Policy. pic.twitter.com/ojcvimlm6b
— US-India Strategic Partnership Forum (@USISPForum) May 18, 2023
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఈ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఏరోస్పేస్ కంపెనీలు, అడ్వైజరీ సంస్థలు, అంకుర సంస్థలు పాల్గొన్నాయి. ఆయా కంపెనీలు డిఫెన్స్ రంగంపై చర్చలు నిర్వహించాయి. ఏరోస్పేస్ రంగంతో పాటు ప్రైవేట్ సెక్టార్ డిఫెన్స్ పెట్టుబడులు భారీ పెరిగినట్లు మంత్రి చెప్పారు. తెలంగాణలో గత 9 ఏళ్లు నుండి ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగాయని, అమెరికాకు చెందిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సంస్థలు హైదరాబాద్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Also Read:వీళ్లందరికీ రూ.లక్ష సాయం, గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Also Read: తెలంగాణకు అమెరికా వైద్య పరికరాల దిగ్గజం - రూ. 3 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మెడ్ ట్రానిక్స్ !