News
News
X

Minister KTR: కుంచిత రాజకీయాల కోసమే ఐటీఐఆర్ రద్దు - మంత్రి కేటీఆర్

Minister KTR: కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ రద్దు చేయడాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. కుంచిత రాజకీయాల కోసమే దీన్ని రద్దు చేశారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

FOLLOW US: 

Minister KTR: హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు తీవ్రంగా తప్పు పట్టారు. కుంచిత రాజకీయాల కోసం ఐటీఐఆర్ రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం, ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్ లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. బీజేపీ డిఎన్ఏలో నిండి ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలను ఎప్పటిలాగే అలవోకగా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వల్లె వేశారని కేటీఆర్ విమర్శించారు. రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్ ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసి మోడీ ప్రభుత్వం, తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. 

2008లో ఐటీఐఆర్ ఏర్పాటుకు ప్రతిపాదన..

ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దుతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింత ఎదిగే అవకాశాన్ని కొల్పొయిందన్న కేటీఆర్, ప్రస్తుతం హైదరాబాద్ ఐటి పరిశ్రమ సాధిస్తున్న ప్రగతికి కేంద్రం చేసింది ఎంలేదన్నారు. 2008 లో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదన చేసి, 2013లో దానికి ఆమోదం తెలిపినా, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తెలంగాణకు శనిలా దాపురించిన మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విభజన హమీల మాదిరే హైదరాబాద్ ఐటీఐఆర్‌ను కూడా మూలకు పెట్టిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు తాను కూడా వివిధ సందర్భాల్లో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులను ఐటీఐఆర్ గురించి అడిగామన్న కేటీఆర్, ఎన్నిసార్లు కోరినా తోలుమందం కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు. మోడీ ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని గుర్తించిన తర్వాతే ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమాన స్థాయిలో, హైదరాబాద్ ఐటీకి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50సార్లు కేంద్రాన్ని కోరమని తెలిపారు. 

హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టుకు తాము చేస్తున్న ధోఖాను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ గల్లీ లీడర్లు పూటకో మాట మాట్లాడి ఇన్ని రోజులు పబ్బం గడుపుకున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న మోడీ ప్రభుత్వం, రాజకీయంగా తమకు ప్రయోజనం కాదన్న ఏకైక కారణంతోనే ఐటీఐఆర్‌ను రద్దు చేసిందని ఆరోపించారు. ఆధునిక భారత్ ను నిర్మించడంపై తమకున్న విధానపర అశక్తతను పార్లమెంట్ లో ఒప్పుకుని తెలంగాణ ఐటీ గ్రాడ్యుయేట్లు, వృత్తి నిపుణులు, యువతకు మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీంతో పాటు ఐటీఐఆర్ రద్దుతో ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో తెలంగాణకు జరిగిన నష్టం పై వివరణ ఇవ్వాలన్నారు. కేంద్రంలోని వివిధ శాఖలు ప్రవేశ పెట్టిన స్మార్ట్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ లను తెలంగాణకు మంజూరు చేసినందుకే ఐటీఐఆర్ ను రద్దు చేశామని కేంద్రం చెప్పడం వారి ఇంటలెక్చువల్ బ్యాంకురప్టసీకి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు.

తెలంగాణకు బీజేపీ వల్ల దక్కిందేమీ లేదు..

కనీసం ఐటీఐఅర్ రద్దుకు కేంద్రం పెర్కొంటున్న అయా పథకాల్లలోనూ తెలంగాణకి దక్కింది ఏం లేదని కేటీఆర్ అన్నారు. ఐటీ పరిశ్రమ బలోపేతం కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకాన్ని ఇతర రంగాల్లోని కార్యక్రమాలను చూపి రద్దు చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికున్న విధానపరమైన నిబద్దతకు నిదర్శనమని ఎద్దేశా చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ లకు లెక్కలేనన్నీ కేంద్ర పథకాలను మంజూరు చేసుకుంటూ, తెలంగాణకు వస్తున్న చారానా, ఆఠానా మందం పనులను కూడా సాకుగా చూపెట్టడం దారుణమన్నారు. ఐటీఐఆర్ కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు మోడీ ప్రభుత్వం ఇచ్చిందేంటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ఇక్కడి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నా… ప్రధాని మోడీలో చలనం రావడం లేదని కేటీఆర్ విమర్శించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పురోగమిస్తున్న తెలంగాణ ఐటి రంగ ప్రగతిని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వ నికృష్ట రాజకీయానికి ఈమద్యనే ప్రకటించిన సాఫ్ట్ వేర్ పార్క్ లే సాక్ష్యం అన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళ రాష్ట్రాలకు సాఫ్ట్ వేర్ పార్క్ లను కేటాయించిన కేంద్రం, తెలంగాణకు మరోసారి అన్యాయం చేసిందన్నారు. ఈ విషయంలోనూ పలుమార్లు కేంద్రానికి విజ్ఝప్తి చేసినా స్పందనలేదన్నారు. దేశ వ్యాప్తంగా 22 సాప్ట్ వేర్ పార్కులను ప్రకటిచించి తెలంగాణకు మెండిచేయి చూపడం బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిన్నచూపుకు నిదర్శనమన్నారు. ఒకవైపు ఐటిఐఅర్, సాప్ట్ వేర్ పార్కుల్లో తెలంగాణకు స్ధానం ఇవ్వని కేంద్రం, తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ టి హాబ్ -2  నిర్మాణాన్ని 450 కోట్లతో పూర్తి చేస్తే, దానికి కేంద్రం నుంచి పైసా సహాయం లేదన్నారు.

ఐటిఐఅర్‌కు సమానంగా ఒక పథకాన్ని తేవాలి..

యువతకు  ఉపాది కల్పించే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముందుచూపు లేదని, యువతకు ఉపాది కల్పణ, శిక్షణ రంగాల్లో కేంద్రం విఫలం అయిన విషయాన్ని దేశంలోని యువత, నిరుద్యోగులు గమనిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఇలా తెలంగాణ ఐటి రంగంతోపాటు, అన్ని అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రం విధానాలను ఇక్కడి యువత గమనించాలని కోరారు. మరోపైపు కేంద్రం సంపూర్ణ సహాయ నిరాకరణ, వివక్ష చూపుతున్న ఉపాది కల్పనలో తెలంగాణ ముందు వరుసలో ఉన్న విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటికైనా దేశ ఐటీ రంగానికి దిక్సూచిగా ఎదుగుతున్న తెలంగాణ ఐటి రంగానికి కేంద్రం ప్రత్యేకంగా ఐటిఐఅర్‌కు సమానంగా ఒక పథకాన్ని లేదా ప్యాకేజీని ప్రకటించి తెలంగాణ పట్ల తమ నిబద్దత చాటుకోవాలని కేటీఆర్ సూచించారు.

Published at : 29 Jul 2022 06:13 PM (IST) Tags: minister ktr minister ktr latest news Minister KTR Comments on ITDR Cancellation ITDR Cancellation Minister KTR Fires on BJP

సంబంధిత కథనాలు

నెక్స్ట్‌ తెలంగాణ డీజీపీ ఎవరు? పోటీలో ఎవరెవరున్నారంటే?

నెక్స్ట్‌ తెలంగాణ డీజీపీ ఎవరు? పోటీలో ఎవరెవరున్నారంటే?

Breaking News Live Telugu Updates: విప్లవ రచయిత వరవరరావుకు సుప్రీం కోర్టు బెయిల్

Breaking News Live Telugu Updates: విప్లవ రచయిత వరవరరావుకు సుప్రీం కోర్టు బెయిల్

Rythu Bheema: రైతులకు గుడ్ న్యూస్ - రైతు బీమా దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు, ఎప్పటి వరకంటే?

Rythu Bheema: రైతులకు గుడ్ న్యూస్ - రైతు బీమా దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు, ఎప్పటి వరకంటే?

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

టాప్ స్టోరీస్

5G Spectrum Sale: టార్గెట్‌ మిస్సైనా 5జీ స్పెక్ట్రమ్‌ వేలం విజయవంతమే! ఎందుకంటే!!

5G Spectrum Sale: టార్గెట్‌ మిస్సైనా 5జీ స్పెక్ట్రమ్‌ వేలం విజయవంతమే! ఎందుకంటే!!

BJP Vishnu : కొద్ది సెకన్ల వీడియోతో దుష్చ్రచారం - జాతీయ జెండాను తిరగేసి పట్టుకున్న అంశంపై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి క్లారిటీ !

BJP Vishnu :  కొద్ది సెకన్ల వీడియోతో దుష్చ్రచారం - జాతీయ జెండాను తిరగేసి పట్టుకున్న అంశంపై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి క్లారిటీ !

పార్టీ నేతలే వెన్నుపోటుదారులు- టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆరోపణలు

పార్టీ నేతలే వెన్నుపోటుదారులు- టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆరోపణలు

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?