News
News
X

BRS పార్టీ సమన్వయకర్తల పేర్లను ప్రకటించిన మంత్రి కేటీఆర్

విద్యార్థి విభాగం కోసం పార్టీలో వినూత్నంగా కార్యక్రమాలు- KTR

FOLLOW US: 
Share:

భారత రాష్ట్ర సమితి విస్తృతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పార్టీ శ్రేణులందర్నీ ఏకం చేసేలా విస్తృతంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించబోతున్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అట్టహాసంగా ఉంటాయని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు గట్టిగానే చేయాలని నిర్ణయించారు. నియోజకవర్గ ప్రతినిధుల సభ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమాల కోసం వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. రానున్న మూడు నాలుగు నెలలపాటు పార్టీ ఊపిరిసలపనంత షెడ్యూల్ చేసి పెట్టుకుంది.

ఈ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రత్యేకంగా పార్టీ తరఫున టీంని ఫాం చేశారు.  జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలు కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటారు. బాధ్యతలు అప్పజెప్పిన జిల్లాల మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో వెంటనే సమావేశమై పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక, అమలుపైన చర్చించాలని కేటీఆర్ సూచించారు. పార్టీ శ్రేణులు ఈ బృందంతో కలిసి సమన్వయం చేసుకోవాలని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

పార్టీలో పనిచేసే కిందిస్థాయి కార్యకర్త నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నాయకులందరినీ కలుపుకుని ఈ కార్యక్రమాలను రూపొందించారు. ప్రతీ 10 విలేజీలను ఒక యూనిట్ గా తీసుకొని ఎమ్మెల్యేలు పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించబోతున్నారు. పట్టణాల్లో ఒక్కో టౌన్, లేదంటే డివిజన్లను కలుపుకుని ఈ సమ్మేళనాలు ఉంటాయి. ఇందుకోసం స్థానిక ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, కార్పోరేషన్ ఛైర్మన్ లను డీసీసీబీ, డీసీఎంఎస్ తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలని కేటీఆర్ ఇదివరకే ఆదేశించారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలని సూచించారు. ఏప్రిల్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఆత్మీయ సమ్మేళన నిర్వహణ పూర్తి కావాలన్నారు కేటీఆర్.

పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేది వీళ్లే:

వనపర్తి, జోగులాంబ గద్వాల - తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీ

మేడ్చల్ - పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ 

కరీంనగర్, రాజన్న సిరిసిల్ల- బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ    

నల్గొండ - కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ

వికారాబాద్ - పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ

రంగారెడ్డి - ఎల్. రమణ, ఎమ్మెల్సీ 

భద్రాద్రి కొత్తగూడెం - భానుప్రసాద్, ఎమ్మెల్సీ

సంగారెడ్డి - వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్సీ

మెదక్- యెగ్గే మల్లేశం, ఎమ్మెల్సీ

మహబూబ్ నగర్, నారాయణపేట- కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ

యాదాద్రి భువనగిరి- డా. యాదవరెడ్డి, ఎమ్మెల్సీ

నాగర్ కర్నూల్- పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ

భూపాలపల్లి, ములుగు- అరికెల నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ

సిద్దిపేట -బోడకుంటి వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీ

హనుమకొండ, వరంగల్ - MS ప్రభాకర్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్

నిర్మల్, ఆదిలాబాద్- V గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ

మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ - నారదాసు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ

జనగామ-  కోటిరెడ్డి, ఎమ్మెల్సీ

మహబూబాబాద్ - పురాణం సతీష్, మాజీ ఎమ్మెల్సీ

కామారెడ్డి- దండే విఠల్, ఎమ్మెల్సీ

నిజామాబాద్ - బండ ప్రకాష్, ఎమ్మెల్సీ

జగిత్యాల - కోలేటి దామోదర్, పార్టీ సెక్రెటరీ

పెద్దపల్లి- ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేషన్ చైర్మన్

హైదరాబాద్- డా. దాసోజు శ్రావణ్, సీనియర్ నేత

ఖమ్మం - శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ

సూర్యాపేట-  మెట్టు శ్రీనివాస్, కార్పొరేషన్ ఛైర్మన్

Published at : 13 Mar 2023 05:00 PM (IST) Tags: KTR Schedule BRS activity PARTY

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, 10 గంటల పాటు ప్రశ్నల వర్షం

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, 10 గంటల పాటు ప్రశ్నల వర్షం

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్

Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌