News
News
X

BRS News: బీఆర్ఎస్‌లో మ‌హారాష్ట్ర నుంచి భారీగా చేరిక‌లు, మంత్రి స‌మ‌క్షంలో కండువా కప్పుకున్న లీడర్లు

మహారాష్ట్ర నాందేడ్‌లో ఫిబ్రవరి 5న జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో భారీగా చేరేందుకు సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు, ప‌లువురు ప్ర‌ముఖులు ఆస‌క్తి చూపుతున్నారు.

FOLLOW US: 
Share:

బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) దేశమంతా వేగంగా విస్తరిస్తోంది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఒడిషాల నుంచి ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు అధినేత కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరగా, మహారాష్ట్రలోనూ భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర నాందేడ్‌లో ఫిబ్రవరి 5న జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో భారీగా చేరేందుకు సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు, ప‌లువురు ప్ర‌ముఖులు ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్ప‌టికే మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, ఎమ్మెల్యే జోగు రామ‌న్న, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాల‌మ‌ల్లు, సివిల్ స‌ప్లైస్ కార్పోరేష‌న్ చైర్మన్ ర‌వీంద‌ర్ సింగ్,  తదిత‌రులు స‌భ ఏర్పాట్లు, నిర్వ‌హ‌ణ‌, పార్టీ విస్త‌ర‌ణ‌పై దృష్టి పెట్టారు. 

ఈ నేప‌థ్యంలోనే మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నాందేడ్ జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ.. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతలను క‌లుస్తూ గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. గురువారం మ‌హారాష్ట్రకు చెందిన‌ స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. బోక‌ర్ మండలం రాఠీ స‌ర్పంచ్ మ‌ల్లేష్ ప‌టేల్ తో స‌హా 100 మంది మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయ‌కులు బామిని రాజ‌న్న ఆద్వ‌ర్యంలో కండువాలు క‌ప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమ‌లు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను చూసి  బీఆర్ఎస్ లో చేరామ‌ని స‌ర్పంచ్ మ‌ల్లేష్ తెలిపారు.

అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్క‌డ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఏం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నార‌న్నారు. తెలంగాణ జ‌రుగుతున్న అభివృద్ధిని చూసి పొరుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు కూడా తెలంగాణ త‌ర‌హా ప‌థ‌కాలు అమ‌లు చేయాల‌ని కోరుతున్నార‌ని, అందుకే బీఆర్ఎస్ లో చేరేందుకు అసక్తి చూపుతున్నార‌ని తెలిపారు.

అనంత‌రం బోక‌ర్ మండ‌లం రాఠీ, నాంద‌, మాథూడ్, త‌దిత‌ర గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ.... మ‌హిళ‌లు, వృద్దులు, యువ‌కులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిదుల‌ను క‌లుస్తూ.... ఫిబ్ర‌వ‌రి 5న నాందేడ్ లో జ‌రిగే  స‌భ‌కు పెద్దఎత్తున త‌రలివ‌చ్చి స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. 

ఈ కార్య‌క్ర‌మంలో ముధోల్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయ‌కులు బామిని రాజ‌న్న‌, మాజీ డీసీసీబీ చైర్మ‌న్ రాంకిష‌న్ రెడ్డి, మాజీ జ‌డ్పీ చైర్మ‌న్ లోలం శ్యాంసుంద‌ర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Published at : 02 Feb 2023 02:36 PM (IST) Tags: Minister Indrakaran reddy BRS in Maharashtra Maharashtra News BRS leaders

సంబంధిత కథనాలు

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

Minister Errabelli : పేపర్ లీక్ పై పిచ్చి పిచ్చి ఆరోపణలు, దమ్ముంటే నిరూపించండి - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్

Minister Errabelli : పేపర్ లీక్ పై పిచ్చి పిచ్చి ఆరోపణలు, దమ్ముంటే నిరూపించండి - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!