By: ABP Desam | Updated at : 11 Mar 2023 09:24 PM (IST)
ఎమ్మెల్సీ ఎన్నికలు
మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీకి ఈనెల 13వ తేదీన ఓటింగ్ జరగబోతోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. మొత్తం 29,720 ఓటర్లకు గాను 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 126 మెయిన్ పోలింగ్ స్టేషన్లు ఉండగా, 11 అదనపు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 29,720 ఓటర్లలో, పురుషులు 15,472, స్త్రీలు 14,246, ఇతరులు ఇద్దరు.
మొత్తం 137 పోలింగ్ స్టేషన్లలో మహబూబ్ నగర్ జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్లు, నాగర్ కర్నూల్ 14 పోలింగ్ స్టేషన్లు, వనపర్తి 7 పోలింగ్ స్టేషన్లు, జోగులాంబ గద్వాల్ 11 పోలింగ్ స్టేషన్లు, నారాయణ పేట్ 5 పోలింగ్ స్టేషన్లు, రంగారెడ్డి జిల్లాలో 31 పోలింగ్ స్టేషన్లు, వికారాబాద్ 18 పోలింగ్ స్టేషన్లు, మేడ్చల్ మల్కాజ్ గిరి 14 పోలింగ్ స్టేషన్లు, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 739 పోలింగ్ అధికారులు అవసరమైన సిబ్బందిని నియమించారు. మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు కాగా, ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 137 పీవోలు, 137 పీపీవోలు, 319 ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 593 మందిని నియమించగా అందులో 146 మంది రిజర్వ్. 29 మంది పీవోలు, ఏపీవోలు 30 మంది, పోలింగ్ పర్సనల్ 87మంది రిజర్వ్ గా ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ తీసుకుపోవడానికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది 12వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటరుకు రావాలని ఆదేశాలు జారీచేశారు. రిసెప్షన్ సెంటర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 12 మంది సెక్ట్రోల్ అధికారులను నియమించారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మూడు జిల్లాల పరిధిలోని వైన్ షాపులను శనివారం సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మూసేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
బరిలో ఉన్న 21 మంది అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తించారు. జిల్లాలు, ఉపాధ్యాయ సంఘాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఉపాధ్యాయుల ఇంటింటికి వెళ్లి మరీ గెలిపించాలని అభ్యర్ధించారు. నిజానికి ఈ ఎన్నికలకు రాజకీయపార్టీలతో సంబంధాలు లేకపోయినా.. కేండిడేట్ల క్యాంపెయిన్ మాత్రం వాడివేడిగా సాగింది. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. 16వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంటుంది.
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
Breaking News Live Telugu Updates: హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం
Sangareddy Crime News: భూ వివాదంతో పెద్దనాన్న హత్య - తల, మొండెం వేరు చేసి ఒక్కోచోట పడేసిన తమ్ముడి కొడుకు!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్
TDP 41 Years : 41 ఏళ్లలో ఎన్నో సవాళ్లు, సంక్షోభాలు - టీడీపీ పూర్వ వైభవం సాధిస్తుందా ?
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత
SSMB 28 Title : మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసేది ఆ రోజే