By: ABP Desam | Updated at : 03 Dec 2022 05:55 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
చిన్నారిపై అత్యాచారం
Mahabubnagar Crime : మృగాళ్ల చేతిలో నిత్యం ఆడబిడ్డల బతుకులు తెల్లారిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగం వరసకు కూతురు అయ్యే చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. మరో ఇద్దరు కూడా బాలికపై దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అత్యంత దారుణంగా హత్యచేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఓ గ్రామంలో పదో తరగతి బాలికపై సొంత బాబాయ్ మరో ఇద్దరితో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను హత్య చేశారు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్ కు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీంతో బాలికపై కన్నేసిన బాబాయ్ శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో హత్య చేసి పరారయ్యారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామంలో ఉద్రిక్తత
వారంతా వరుసకు బాబాయ్‌లు, అయినా ఆ చిన్నారిని వదల్లేదు. చిన్నారిపై దారుణానికి పాల్పడేందుకు సమయం కోసం ఎదురు చూశారు. బాబాయ్ అంటూ వచ్చిన ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. తమ కోరిక తీర్చుకుని అతి కిరాతకంగా హత్య చేశారు. వరుసకు బాబాయ్ లు అయినా ఇంత కిరాతకానికి ఒడిగట్టడం, ఆ తర్వాత విషయం బయటచెబుతుందని చిన్నారిని హత్య చేశారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులను నమ్మించేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహంతో గ్రామస్తులు నిందితుల ఇంటిపై దాడి చేశారు. వారి వాహనాలు, ఇంట్లో సామాగ్రికి నిప్పుపెట్టారు.
ఎల్ఎల్‌బీ విద్యార్థినిపై ఎమ్మెల్యే పీఏ అత్యాచారం!
వరంగల్ జిల్లా హన్మకొండ నగరంలో ఇటీవల దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఎల్ఎల్‌బీ చదువుతున్న విద్యార్థిని (23)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. నిందితుల్లో ఎమ్మెల్యే పీఏ ఉండటం కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థిని హన్మకొండలోని ఓ కళాశాలలో ఎల్ఎల్‌బీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తనపై లైంగికదాడి జరిగిందని బుధవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఎమ్మెల్యే పీఏ ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే పీఏతోపాటు అతడి స్నేహితుడు, హాస్టల్ నిర్వాహకురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసును విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
తీవ్ర సంచలనం రేపుతున్న వరంగల్ లా విద్యార్థిని రేప్ కేసులో మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్‌కు చెందిన ఎమ్మెల్యే నరేందర్ ప్రైవేట్ పీఏ శివ ఆగడాలను పోలీసులు వెలికి తీస్తున్నారు. యువతి ఫిర్యాదుతో ప్రాథమికంగా దొరికిన సమాచారం ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఇంకా ఎన్ని ఆగడాలు శివ గ్యాంగ్ చేసిందో అన్న కోణంలో దర్యాపప్తు సాగుతోంది. వరంగల్‌కు చెందిన ఎమ్యెల్యే నరేందర్ ప్రైవేట్ పీఏ శివ అతని స్నేహితుడితోపాటు హాస్టల్ ఓనర్‌పై హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు లైంగిక దాడి యత్నం ఫిర్యాదు మేరకు 527/2022, SC/ST, 506, 376, 109, ఆక్ట్-2015 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శివతో పాటు అతడి స్నేహితుడిని, హాస్టల్ నిర్వాహాకురాలిన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో నిందితుల వివరాలు బయటకు రాకుండా హన్మకొండ పోలీసులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినా సాధ్యం పడలేదని తెలుస్తోంది.
Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
Telangana 3వ స్థానంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ యూపీకి చివరి స్థానం: మంత్రి హరీష్ రావు
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం
SI Constable Marks : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
Breaking News Live Telugu Updates: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నొవాక్ జకోవిచ్
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
IND Vs NZ 2nd T20I Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ - భారత్‌కు చావో రేవో!
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !