By: ABP Desam | Updated at : 30 Dec 2022 07:45 PM (IST)
ఈ ఏడాదిలో రూ. 34వేల కోట్లకుపైగా మద్యం అమ్మకాలు -తెలంగాణలో సరికొత్త రికార్డు !
Telangana Liquor Sales : తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది మద్యంపై 34వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిాయి. జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు 34 వేల కోట్ల మధ్యం అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా టాప్లో ఉంది. రెండో ప్లేస్ లో హైదరాబాద్ ఉండగా మూడో ప్లేస్లో నల్లగొండ జిల్లా ఉంది. మద్యం అమ్మకాలు ఏటేటా రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన 2014–15లో రూ. 10.88 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2018–19లో ఇది రూ.20.85 వేల కోట్లకు పెరిగింది. అంటే ఐదేండ్లలో డబుల్ అయింది. 2020–21లో లిక్కర్ ఆమ్దానీ రూ.27.28 వేల కోట్లకు చేరుకుంది. ఈ సారి 34 వేల కోట్లు వచ్చింది.
ప్రతీ ఏటా పెరుగుతున్న లిక్కర్ సేల్స్
నిరుడు (2021–22) సగటున నెలకు రూ.2,500 కోట్ల చొప్పున ఆదాయం వస్తే.. ఈ ఏడాది సగటున రూ.3 వేల కోట్లు సమకూరుతున్నది. కిందటేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 24వ తేదీ వరకు రూ.21,763 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేశారు. ఇందులో 2.65 కోట్ల ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) కేసులు, 2.36 కోట్ల బీరు కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 24 వరకు రూ.25,147 కోట్ల మద్యం సరఫరా కాగా, ఇందులో 2.52 కోట్ల ఐఎంఎల్ కేసులు, 3.48 కోట్ల బీరు కేసులు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి కోటి 12 లక్షల బీర్ కేసులు ఎక్కువగా అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది.
కలసి వస్తున్న పొరుగు రాష్ట్ర మద్యం విధానం
తెలంగాణలో మద్యం అమ్మకాలు పెరగడానికి పొరుగు రాష్ట్రం ఏపీలో మద్యం విధానం కూడా ఓ కారణంగా భావిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అక్కడ దుకాణాలకు కూడా పెద్ద ఎత్తున బిడ్లు వేసి దక్కించుకున్నారు. అమ్మకాలు కూడా అక్కడ ఎక్కువగానే ఉంటున్నాయి. ఏపీలో అన్ని రకాల బ్రాండ్లు అమ్మడం లేదు. కొన్ని ప్రత్యేకమైన బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. హైదరాబాద్ లో మాత్రం అలాంటి సమస్య ఉండదు.
ధరలు పెంచడమూ ఓ కారణమే !
ఈ ఏడాది మద్యం ధరలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఈ కారణంగా కూడా మద్యం ఆదాయం పెరిగినట్లుగా కనిపిస్తోంది. రెండేళ్ల కిందట కరోనా లాక్ డౌన్ తర్వాత కూడా.. మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. ఆ తర్వాత ప్రతీ ఏడాది ఎంతో కొంత పెంచుతూ వస్తోంది. ఈ కారణంగా ఎక్కువగా అమ్మకాలు నమోదవుతున్నాయి. అదే సమయంలో లిక్కర్ సేల్స్ కూడా పెరుగుతోంది. దసరా, న్యూ ఇయర్ వంటి వేడుకల సమయంలో అయితే.. ఒకటి, రెండు రోజుల్లోనే వందల కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటాయి.
మిలటరీలో లేని రూల్ తెలంగాణలో, నిరుద్యోగులు వాత పెట్టడం ఖాయం- ఈటల రాజేందర్
Harish Rao: బీజేపీ ఆ విషయాల్లో డబుల్ సక్సెస్ - అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు సెటైర్లు
Eatala Rajender: టిఫిన్ చెయ్యడానికి అసెంబ్లీలో స్థలమే లేదు - ఈటల, మంత్రుల కౌంటర్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్!
Hyderabad Crime News: బర్త్ డే పార్టీలో బాలికపై యువకుల గ్యాంగ్ రేప్- హైదరాబాద్లో మరో దారుణం!
Breaking News Live Telugu Updates: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు
Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
RBI Policy: దాస్ ప్రకటనల్లో స్టాక్ మార్కెట్కు పనికొచ్చే విషయాలేంటి?