Liquor Price Hike: మందుబాబులకు బిగ్ షాక్, పెరిగిన మద్యం ధలు- నేటి నుంచి అమల్లోకి
Liquor prices go up again in Telangana | తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు మే 19 నుంచి అమల్లోకి రానున్నాయని ప్రకటనలో తెలిపింది.

Telangana Liquor Sales | హైదరాబాద్: తెలంగాణలో మందు బాబులకు ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు (Liquor Price Hike) నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. లిక్కర్ క్వార్టర్ బాటిల్ పై రూ.10, ఆఫ్ బాటిల్ పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్ పై రూ.40 చొప్పున పెంచుతూ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు మే 19 నుంచి అమల్లోకి రానున్నాయని ఈ మేరకు మద్యం దుకాణాలకు, మద్యం డిపోలకు సర్కులర్ జారీ చేసింది.
ఫిబ్రవరి తరువాత పెరిగిన మద్యం ధరలు
బ్రూవరీల యాజమాన్యాల నుంచి డిమాండ్ రావడంతో నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో బీర్ల ధరలను పెంచడం తెలిసిందే. తాజాగా మద్యం బాటిళ్ల ధరలను పెంచి మందుబాబులకు షాకిచ్చారు. అన్ని బ్రాండ్ల మద్యం ధరలను దాదాపు 10 నుండి 15 శాతం పెంచారు. పెరిగిన మద్యం ధరలతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినెలా దాదాపు రూ.130 కోట్ల నుంచి రూ.150 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఫుల్ బాటిల్‌కు కనీసం రూ.40 నుంచి గరిష్టంగా రూ.60 వరకు ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.4,150కి విక్రయిస్తున్న 12 ఇయర్స్ బాలంటైన్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ ధర రూ.4,210కి పెరగనుంది. నిన్నటివరకూ రూ.4,690కి అమ్ముడవుతున్న 12 ఇయర్స్ లైఫ్ గల జానీ వాకర్ బ్లాక్ లేబుల్ ధర రూ.4,730 కి విక్రయాలు జరగనున్నాయి.






















