KTR News: 8 నెలల్లో 50 వేల కోట్ల అప్పులా? కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసిన కేసీఆర్
KTR: మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టటమేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన అప్పులపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
KCR Comments on Congress: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 50 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆందోళన వ్యక్తం చేశారు. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 8 నెలల్లోనే 50 వేల కోట్ల అప్పు చేయటమేనా వాళ్లు చెప్పిన మార్పు అని ప్రశ్నించారు. ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేకుండా రూ. 50 వేల కోట్ల రూపాయలు అప్పు తేవాల్సిన అవసరమెమొచ్చిందని నీలదీశారు.
2023 నాటికి రాష్ట్రం 5,900 కోట్ల మిగులు బడ్జెట్ తో ఉంటే 8 నెలల కాలంలో దాన్ని 50 కోట్ల అప్పుగా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్ర సంపద పెంచిన బీఆర్ఎస్ పై అప్పులు, అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. అపోహలు, అర్థ సత్యాలను ప్రచారం చేసి జనాన్ని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతూ అప్పులు చేయటంలో టాప్ లో నిలుస్తుందన్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమధానం చెబుతుందని కేటీఆర్ (KTR) ప్రశ్నించారు.
ఇదే విధంగా అప్పులు చేసుకుంటూ పోతే కాంగ్రెస్ పదవీకాలం ముగిసే నాటికి 4-5 లక్షల కోట్ల అప్పుల భారం రాష్ట్రం పై పడడం ఖాయమని చెప్పారు. అప్పుల విషయంలో బీఆర్ఎస్ ను బద్నాం చేసి ప్రజలను మోసం చేయటంలో కాంగ్రెస్ విజయవంతమైందన్నారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో కాంగ్రెస్ కు కచ్చితంగా బుద్ది చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.
పల్లెల్లో పాలన పడకేసింది - కేటీఆర్
‘‘కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి.. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది.. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచ్ ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో.. పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారింది. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయి’’ అని కేటీఆర్ మరో పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి..
— KTR (@KTRBRS) August 14, 2024
ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది..
అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో… pic.twitter.com/Yk6qlkejWT