అన్వేషించండి

KTR : గురువారం రేవంత్ దిష్టిబొమ్మల దహనం - ఆడబిడ్డలపై వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ పిలుపు

Telangana : గురువారం రేవంత్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆడబిడ్డలపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.

Telangana Politics :  పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల పైన ముఖ్యమంత్రి చేసిన   వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది.  తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సొయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ... జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.        

సుదీర్ఘ కాలం పాటు ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యకర్తల ఆశీర్వాదంతో, అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళ సభ్యులపైన, అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ మనసులను నోప్పించాయని.. జీవితంలో ఎదగాలనుకుంటున్న ప్రతి ఒక్క మహిళకు, ఆడబిడ్డకు ఈ వ్యాఖ్యలు అవమానకరమని కేటీఆర్  ఆవేదన వ్యక్తం చేసారు.  అధికారం అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదని తెలిపిన కేటీఆర్, రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా  గురువారం ఆయన దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు.               

దిష్టిబొమ్మల దహనంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా...  ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.  మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయమన్నారు. రేవంత్‌ సీఎం పదవికి అన్‌ఫిట్‌ అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగులుతుందని.. ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు అన్నారు.                   

ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం ఎవర ఇచ్చారని  భట్టి విక్రమార్కపై కేటీఆర్ మండిపడ్డారు.  పదేళ్లు అధికారంలో ఉన్న ఏరోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించలేదన్నారు.  ముఖ్యమంత్రి ఏకవచనంతో మాట్లాడామని అని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నామని.. అది తమకు కేసీఆర్ నేర్పించిన సంస్కారమని తెలిపారు. అసెంబ్లీలో ఈరోజు మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానమని.. ముఖ్యమంత్రి సిగ్గు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని సంస్కరించుకోవాలని సలహా ఇచ్చారు.                                    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Embed widget