అన్వేషించండి

KTR: ఢిల్లీలో ఫైటింగ్, తెలంగాణలో రెడ్ కార్పెట్ - కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం

BRS News: రాష్ట్రాన్ని అదానికి అప్పచెబుతున్న రేవంత్ ని ఆపగలిగే శక్తి రాహుల్ కి ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీతో దేశానికి నష్టమైతే.. తెలంగాణకు లాభం ఎట్లా అవుతుందని కేటీఆర్ నిలదీశారు.

KTR News: హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ-సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపులిచ్చిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం అదే అదానీ కంపెనీకి స్వాగతం పలకడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సూటిగా ప్రశ్నించారు. అదానీపై జాతీయ కాంగ్రెస్ కు ఒక నీతి.. ? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు మరో నీతా ?? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. “ఒక వైపు మీరేమో...  అదానీ-సెబీ ఆరోపణలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తున్నారు కానీ ఇక్కడ మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమో.. అదానీకి స్వయంగా రెడ్ కార్పెట్ పరుస్తున్నారు.. అదానీ కంపెనీకి ద్వారాలు తెరుస్తున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఏకంగా అదానీకే అప్పగిస్తున్నారు” అని కేటిఆర్ ధ్వజమెత్తారు. 

మీరు ఆదానీ-సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తే.. అదానీ-కాంగ్రెస్ మిలాఖాత్ పైనా, లోపాయికారి ఒప్పందాలపైనే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ స్పష్టంచేశారు. అదానీ వల్ల దేశానికి నష్టం అన్నప్పుడు.. మరి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం లాభమెలా అవుతుందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

తెలంగాణలో.. అదానీ కంపెనీల ఆగమనాన్ని రాహుల్ గాంధీకి ఆపగలరా.. కాంగ్రెస్ సీఎం నిర్వాకాన్ని నిలదీసే ధైర్యం చేయగలరా.. అదానీ పెట్టుబడులకు ఫుల్ స్టాప్ పెట్టగలరా..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేయగలరా..?? అంత శక్తి రాహుల్ గాంధీకి ఉన్నదా అని కేటీఆర్ ప్రశ్నించారు. 

అదానీపై..  ఢిల్లీ కాంగ్రెస్ ది ఒకమాట..? గల్లీ కాంగ్రెస్ ది మరో మాటనా అన్న కేటీఆర్ అదానీపై కాంగ్రెస్ చేస్తున్నట్టు చెబుతున్న పోరాటంలో... చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదన్నారు. ఒక జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ లో...ఈ ద్వంద్వ వైఖరి.. కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం కాదా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రెండునాల్కల వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తోందనీ,  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాల్ని కూడా నిశితంగా  పరిశీలిస్తోందని గుర్తుచేశారు. కాంగ్రెస్ కు అధికారమిచ్చిన పాపానికి.. తెలంగాణను అదానీకి అప్పగించాలని చూస్తే సహించమని, రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టంచేశారు. తెలంగాణ హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టే పార్టీ బీఆర్ఎస్ అనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టాకోవాలన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy unveils NTR statue: కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
Hyderabad land auction Rayadurgam 2026: హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం - ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!
హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం - ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!
PM Kisan: రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
Adilabad Crime News: పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!
పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy unveils NTR statue: కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
NTR Bharat Ratna resolution Mahanadu 2026: మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
Sara Khan On EID: బక్రీద్‌కు జంతు బలి ఎందుకు? సారా ఖాన్ పోస్టుపై గరమ్ గరమ్
బక్రీద్‌కు జంతు బలి ఎందుకు? సారా ఖాన్ పోస్టుపై గరమ్ గరమ్
Hyderabad land auction Rayadurgam 2026: హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం - ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!
హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం - ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!
Jagan PA KNR liquor scam investigation: ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ పీఏ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - అరెస్టు తప్పదా?
ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ పీఏ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - అరెస్టు తప్పదా?
Why Hot Water Freezes Faster:వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ?
వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ?
Tips To Happy Marriage : మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్.. లేదంటే నరకంగా మారొచ్చు
మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్.. లేదంటే నరకంగా మారొచ్చు
Anasuya: షార్ట్స్‌లో అనసూయ... స్టైలిష్‌గా బ్యూటిఫుల్ లేడీ
షార్ట్స్‌లో అనసూయ... స్టైలిష్‌గా బ్యూటిఫుల్ లేడీ
Embed widget