News
News
X

komatireddy : కోమటిరెడ్డి సొంత బాట .. రేపట్నుంచే ఉద్యమం చేస్తానన్న ఎంపీ !

కోమటిరెడ్డి వెంకటరెడ్డి తానే స్వయంగా ఉద్యమం చేస్తానని ప్రకటించారు. పార్టీ సరిగ్గా పనిచేయడం లేదన్న ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాణిగం ఠాగూర్, రేవంత్ రెడ్డిలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

FOLLOW US: 

రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి దూరంగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తానేంటో చూపిస్తానని మీడియా ముందు సవాల్ చేశారు. గాంధీభవన్ మెట్లెక్కనని గతంలోనే సవాల్ చేసిన ఆయన ఇటీవలి కాలంలో అటు వైపు వెళ్లలేదు. అయితే సీఎల్పీ కార్యాలయానికి మాత్రం వస్తున్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో సీనియర్ నాయకుడు వీహెచ్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదివారం నుంచే తానేమిటో చూపిస్తానని సవాల్ చేశారు.  

Also Read : పన్నులు తగ్గించాలని ఆందోళనలు .. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ సెగ !

కాంగ్రెస్‌ తన ప్రాణమని.. సోనియా గాంధీ తన దేవతన్నారు. కాంగ్రెస్‌ అంటే ప్రాణమిచ్చే వ్యక్తి వీహెచ్‌ అని, ఆయనలాంటి నేతలంటే తనకెంతో గౌరవమన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని మెరుగుపరచాల్సి ఉందన్నారు. ధార్యం అమ్ముకోలేక చనిపోయిన కామారెడ్డి రైతు కుటుంబాన్ని ఆదివారం పరామర్శించి.. అక్కడ్నుంచే ఉద్యమం ప్రారంభిస్తానని ప్రకటించేశారు.   హుజురాబాద్ ఫలితం తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు గళం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా పలువురు సీనియర్ నేతలు రేవంత్ నిర్ణయాలను తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ కమిటీలో కోమటిరెడ్డి సభ్యుడైనప్పటికీ హాజరు కావడం లేదు.

Watch Video : సీనియర్లకు అడ్డంగా బుక్కైన రేవంత్ రెడ్డి... బైపోల్ ఓటమితో విమర్శల వెల్లువ

ఇప్పుడు నేరుగా రేవంత్ రెడ్డిపైనే విరుచుకుపడ్డారు.  తమ నేతలకు ప్రజల్లో క్రేజ్ ఉందనుకున్నానని లేకపోతే తానే ప్రచారానికి వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. మాణిగం ఠాగూర్‌ను కోమటిరెడ్డి వదిలి పెట్టలేదు. ఆయన లాంటి నేతలుతెలంగాణకు వచ్చి 2023లో అధికారం మాదే అంటుంటే నిజమే అనుకున్నానని కోమటిరెడ్డి సెటైర్ వేశారు. బద్వేలు ఉపఎన్నికలో కాంగ్రెస్​కు 6వేల ఓట్లు వచ్చాయని కానీ.. హుజూరాబాద్​లో 3వేల ఓట్లే వచ్చాయన్నారు. తాను పెద్ద నాయకుడిని కాదని ఇంట్లో కూర్చున్నానని లేకపోతే ప్రచారానికి పోయేవాడనన్నారు. 

Also Read : టీఆర్ఎస్‌కు వరుస కష్టాలు .. "విజయ గర్జన"కు స్థలం సమస్య .. ఎక్కడికెళ్లినా రైతుల ఆందోళన !
  
ఓ వైపు సోనియా గాంధీని పొగుడుతూ మరో వైపు మాణిగం ఠాగూర్‌ను, రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కోమటిరెడ్డి రంగంలోకి దిగడం కాంగ్రెస్ వర్గీయుల్ని ఆశ్చర్య పరుస్తోంది.  స్వయంగా తాను ఉద్యమం చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీలోనూ చర్చనీయాంశం అవుతోంది. కోమటిరెడ్డి పార్టీ పరంగా ఏం చేయాలన్నా పొలిటికర్ ఎఫైర్స్ పార్టీ అనుమతి తీసుకోవాలి.. తీసుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఆయన నేరుగా పార్టీపై తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నా అన్న అనుమానం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. 

Also Read : కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ .. కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నారా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Nov 2021 04:21 PM (IST) Tags: revant reddy Telangana Congress Komatireddy Venkatereddy Manikyam Tagore Congress High Command MP Komatireddy

సంబంధిత కథనాలు

Breaking News Telugu Live Updates: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్

Breaking News Telugu Live Updates: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్

Sathupally Crime మంచిగా ఉండాలని సూచిస్తే, ఏకంగా ఇల్లు తగులబెట్టాడు - పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు

Sathupally Crime మంచిగా ఉండాలని సూచిస్తే, ఏకంగా ఇల్లు తగులబెట్టాడు - పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు

రద్దయిన పాత నోట్లను కొత్తగా మార్చే స్వామిజీ!

రద్దయిన పాత నోట్లను కొత్తగా మార్చే స్వామిజీ!

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

ED Raids: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో హైదరాబాద్‌ సహా 35 చోట్ల ఈడీ సోదాలు

ED Raids: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో హైదరాబాద్‌ సహా 35 చోట్ల ఈడీ సోదాలు

టాప్ స్టోరీస్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

భగవంతుని ఆగ్రహానికి గురి కావద్దు- టీటీడీకి విజయ శంకర స్వామి వార్నింగ్

భగవంతుని ఆగ్రహానికి గురి కావద్దు- టీటీడీకి విజయ శంకర స్వామి వార్నింగ్

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

Munugodu By Election: నేటి నుంచి మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్లు

Munugodu By Election: నేటి నుంచి మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్లు