Breaking News Telugu Live Updates: యూజీసీ నెట్ పరీక్ష వాయిదా
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
LIVE

Background
యూజీసీ నెట్ సెకండ్ ఫేజ్ పరీక్ష వాయిదా
UGC-NET సెకండ్ ఫేజ్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను సెప్టెంబర్ 20-30 తేదీల మధ్య నిర్వహిస్తామని UGC ఛైర్మన్ జగదీష్ కుమార్ ప్రకటించారు.
తెలంగాణ కానిస్టేబుల్ పరీక్ష తేదీ మార్పు
Constable Exam : తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మారింది. ఈ నెల 21న జరగాల్సిన పరీక్షను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాయిదా వేసింది. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నట్టు బోర్డు ప్రకటించింది.
PV Sindhu Wins Gold AT CWG 2022: స్వర్ణం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు, మూడో ప్రయత్నంలో సక్సెస్
PV Sindhu Wins Gold: తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది! అశేష భారతావనిని మరోసారి మురిపించింది. బర్మింగ్‌హామ్‌లో తన రాకెట్ పవర్ చూపించింది. కామన్వెల్త్ క్రీడల్లో విలువైన స్వర్ణ పతకం ముద్దాడింది. ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్, కెనడా షట్లర్ మిచెల్ లీని 21-15, 21-13 తేడాతో చిత్తు చేసింది. వీరిద్దరూ గతంలో 10 సార్లు తలపడగా 8 విజయాలతో సింధూదే పైచేయి కావడం గమనార్హం. ఈ ఏడాది వీరిద్దరూ రెండు సార్లు తలపడగా రెండుసార్లూ తెలుగమ్మాయినే విజయం వరించింది.
78 శాతం పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదు - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె .రామకృష్ణ
78 శాతం పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదు అని పోలవరం రౌండ్ టేబుల్ సమావేశము లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె .రామకృష్ణ అన్నారు. నిర్వాసితులను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణం మొదలు పెట్టలేదని, కనుక ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు నిర్వహిస్తాం అన్నారు.
TTD Retired Employee Murder: టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్య, చోరీ కేసు ఫిర్యాదే కారణమా
తిరుపతి : తిరుపతిలో టీటీడీ రిటైర్ట్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. తిరుపతిలోని ఎంఆర్ పలెల్లో ఆదివారం అర్ధరాత్రి నారాయణస్వామిని దుండగులు కొట్టి హత్య చేశారు. తన గోల్డ్‌చైన్ పోయిందని ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల నుంచి స్పందన రాకపోవడంతో నారాయణస్వామి మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నారాయణస్వామి ఇంటిపక్కన ఉండేవారిని ప్రశ్ని స్తున్న సమయంలో ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురికావడం సంచలనం కలిగించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

