అన్వేషించండి

Telangana Elections 2023 : డబుల్ రోడ్ ఉంటే తెలంగాణ - సింగిల్ రోడ్ ఉంటే ఏపీ - సత్తుపల్లిలో ఏపీపై కేసీఆర్ సెటైర్లు !

సత్తుపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ ఏపీ పాలనపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఏపీలో చీకట్లు ఉన్నాయన్నారు. ఏపీ రైతులు ధాన్యం తెలంగాణలో అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానించారు.

 

Telangana Elections  2023 :  తెలంగాణ వస్తే చీకటి అవుతుందని శాపాలు పెట్టిన వారే ఇప్పుడు చీకట్లో మగ్గుతున్నారని తెలంగాణ సీఎం కసీఆర్ సత్తుపల్లిలో సెటైర్ వేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లిలో  ప్రజా ఆశీర్వాద సభను ఏర్పాటు చేశారు. సండ్ర వెంకట వీరయ్యను గెలిపించమని ఆయన కోరారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ప్రజలకు తెలంగాణ పాలన ఎట్లున్నదో తెలుసన్నారు. పొరుగు రాష్ట్రం ఏపీ సరిహద్దుల్లో సత్తుపల్లి ఉంటుంది. ఎప్పుడూ పోయి వస్తూంటారని..  డబుల్ రోడ్లు ఉంటే తెలంగాణ .. సింగిల్ రోడ్ ఉంటే ఏపీ అన్నారు. 

ఏపీలో రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు సరిగ్గా నిర్మించలేదని కేసీఆర్ భావన. అదే సమయంలో  ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. అలాగే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే పాలన రాదని.. హేళన చేశారని కానీ ఇప్పుడు ఏపీ నుంచి రైతులు తెలంగాణ కు వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. తెలంగాణలో ధాన్యం అమ్ముకునేందుకు ఏపీ రైతులు వస్తన్నారని అక్కడి ప్రభుత్వం సరిగ్గా ధాన్యం సేకరణ చేయడం లేదని కేసీఆర్ చెప్పినట్లయింది. అదే సమయంలో విద్యుత్ అంశంపైనా స్పందించారు. తెలంగాణలో కరెంట్ పోదన్నారు. రాష్ట్రం విడిపోతే.. తెలంగాణ చీకటి అవుతుందని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కర్ర పట్టుకుని చూపించారన్నారు. కానీ ఇప్పుడు ఏపీలో చిమ్మ చీకట్లు ఉన్నాయని గుర్తు చేశారు.

మోటార్లకు మీటర్లు పెడితే పెద్ద ఎత్తున నిధులు ఇస్తామన్నారని..కానీ అలా పెట్టేది లేదని చెప్పామన్నారు. పాతిక వేల కోట్లు నష్టం వచ్చినా సరే మీటర్లు .. రైతుల మోటార్లకు పెట్టేది లేదన్నారు. ఏపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టేందుకు అంగీకరించి అప్పులు , అదనపు సాయం తెచ్చుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ షరతులకు అంగీకరించలేదు. ఇదే విషయన్ని కేసీఆర్ పరోక్షంగా చెప్పినట్లయింది. కేసీఆర్ ఏపీ సర్కార్ పై సందర్భం వచ్చినప్పుడల్లా సెటైర్లు వేస్తూంటారు. గతంలో  ప్లీనరీలో ఏపీ గురించి.. చెప్పారు. ఇప్డుడు ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో అలాంటి సెటైర్లు వేశారు. 

కేసీఆర్ అరుదుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు కానీ.. కేటీఆర్, హరీష్ రావులు తరచూ ఏపీలో పాలనా వైఫల్యాలు.. అక్కడి పరిస్థితులపై తరచూ మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల పనితనం - పగతనం అని హరీష్ రావు కక్ష సాధింపు రాజకీయాలపైనా మాట్లాడుతున్నారు. కొన్ని వంద కోట్ల అప్పు కోసం సీఎం జగన్.. మోటార్లకు మీటర్లు పెట్టేందుకు అంగీకరించి రైతుల మెడకు ఉరితాళ్లు వేశారని హరీష్ రావు చాలా సార్లు అన్నారు. తాము అలా చేసేది లేదన్నారు. ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ రాకపోతే అమరావతి లాగే హైదరాబాద్ అవుతుందని హెచ్చరించారు. ఈ మాటలు వైరల్ అయ్యాయి. కేటీఆర్ ఓ సారి.. ఏపీని నరకంతో పోల్చారు. అప్పట్లో వివాదాస్పదమయింది. 

నిజానికి బీఆర్ఎస్ తో ఏపీ అధికార పార్ట పెద్దలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా రెండు పార్టీలు సహకరించుకుంటూ ఉంటాయి. బీఆర్ఎస్ పై .. వైసీపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయరు కానీ.. బీఆర్ఎస్ నేతలు మాత్రం.. తరచూ తమ పాలన ఎంత గొప్పగా ఉందో చెప్పుకోవడానికి ఏపీ పరిస్థితుల్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. ఇలా విమర్శించినప్పుడు కొంత మంది వైసీపీ నేతలు తిరిగి విమర్శిస్తూ ఉంటారు. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Telangana High Court Order: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget