KCR : కేసీఆర్ మర్చిపోయారా ? అలవాటుగా మారిందా ?. దళితులకు మూడెకరాల హామీపై దూసుకొస్తున్న ప్రశ్నలు !
దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీని ఇవ్వలేదని కేసీఆర్ ప్రకటించడం రాజకీయ వివాదంగా మారింది. జీవోలు, మేనిఫెస్టో పత్రాలను దళిత నేతలు బయట పెడుతున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే దళితుకు మూడు ఎకరాలు ఇస్తామని తామ ఎప్పుడు హామీ ఇవ్వలేదని చెప్పడం. అంతే కాదు మేనిఫెస్టోలో కూడా తాము ఎప్పుడూ అలా ఇస్తామని చెప్పలేదని ఆయన ప్రకటించేశారు. దీంతో విపక్ష పార్టీల నేతలు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తెలంగాణ రాక ముందు నుంచి .. ఉద్యమంలో కూడా కేసీఆర్ .. ప్రత్యేక రాష్ట్రం వస్తే దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని హామీ ఇస్తూ వచ్చారు. తర్వాత అదే ఎన్నికల హామీ అయింది. మేనిఫెస్టోల్లోనూ పెట్టారు. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి హామీ ఇవ్వలేదని నిస్సంకోచంగా కేసీఆర్ చెబుతున్నారు.
Also Read : పేదరికంతో వైద్య విద్య ఆపేసి కూరగాయల అమ్మకం ! కేటీఆర్‌కు తెలిసిన వెంటనే...
దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడం అనేది కేసీఆర్ ఫ్లాగ్ షిప్ స్కీముల్లో ఒకటి. 2014లో దళితులంతా ఏకపక్షంగా ఆయనకు మద్దతు పలకడానికి ఈ హామీ కీలకం. ఆ తర్వాత ఈ హామీని అమలు చేయడానికి ప్రయత్నించారు కూడా. జీవో కూడా రిలీజ్ చేశారు. ఈ జీవోలను కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
#KCR@KTRTRS
— Lawyer for Social Justice (@AdvKatkuri) October 6, 2021
మూడు ఎకరాల భూమి ఇస్తామన లేదు @TelanganaCMO sir, మరి
GO MS No.1 dated 26.07.2014 ఎవరూ ఇచ్చింది?
చూడండి ఎవరో ప్రభుత్వ website కూడా పెట్టారు.https://t.co/9pobYCpc97
Website hack చేశారా ఎవరైనా ? https://t.co/TGZ3sXYRS6 pic.twitter.com/5NbRX1NeEa
Also Read : మంత్రి కేటీఆర్ కారుకు చలాన్ వేసిన ట్రాఫిక్ సిబ్బంది... మంత్రి ఏంచేశారో తెలుసా..!
నిజానికి దళితులకు మూడెకరాల భూమి హామీని అమలు చేయడం కూడా ప్రారంభించారు. కొంత మందికి ఇచ్చారు . ఎంత ఖర్చు అయినా కొనుగోలు చేసి ఇస్తామని పలుమార్లు ప్రకటించారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఆ హామీ ఉంది. అయినప్పటికీ ఆయన ఆ హామీ ఇవ్వలేదని.. మేనిఫెస్టోలో ప్రకటించలేదని అసెంబ్లీలో చెప్పడం వివాదాస్పదం అవుంతోంది. సోషల్ మీడియాలో పలువురు టీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రదర్శనకు పెడుతున్నారు. సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పేపర్ క్లిప్పింగ్‌ను కూడా షేర్ చేస్తున్నారు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కాపీలో ఉన్న షెడ్యూల్ కులాల సంక్షేమం అనే పేజీలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీ ఉందని చెబుతున్నారు.
ఇది మీ 2014 manifesto.
— Lawyer for Social Justice (@AdvKatkuri) October 6, 2021
అబద్ధాల కైనా హద్దుండాలి.
తెలంగాణ ప్రజల మోసం ఇంకేనాళ్ళు.
नहीं चलेगा
नहीं चलेगा KCR sir.#NahiChalega @KTRTRS
@TelanganaCMO #Telangana #Hyderabad pic.twitter.com/Evj4p9dRYi
దళితులకు మూడెకరాల భామీపై కేసీఆర్ యూటర్న్ తీసుకోవడాన్ని విపక్ష పార్టీలు అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్‌కు హామీలు ఇవ్వడం మర్చిపోవడం సహజమేనని విమర్శిస్తున్నారు. కేసీఆర్ ప్రకటనను టీఆర్ఎస్ నేతలు ఇంకా సమర్థించడం ప్రారంభించలేదు.
Also Read : ఎరక్కపోయి ఇరుక్కున్న ఎయిరిండియా.. ఫ్లైట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఎలా ఇరుక్కుందో చూడండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి