T HUB Opening KCR : స్టార్టప్ ఆప్ క్యాపిటల్‌గా హైదరాబాద్ - టీ హబ్‌తో యువ వ్యాపారవేత్తలు వస్తారన్న సీఎం కేసీఆర్ !
హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్ చేస్తామని కేసీార్ ధీమా వ్యక్తం చేశారు. టీ హబ్ 2 ను ఆయన ప్రారంభించారు.
T HUB Opening KCR : టీ హబ్ స్థాపించాలనే ఆలోచనకు ఎనిమిదేళ్ల కిందే అంకురార్పణ జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ ఐటీకారిడార్‌లో ప్రభుత్వం నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్దదైన టీ హబ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రపంచంలో యువ భారత్ సామర్థ్యాన్ని తెలుపాలని టీ హబ్ ప్రారంభించినట్లు చెప్పారు. 2015లో మొదటి దశ టీ హబ్‌ను ప్రారంభించామని వెల్లడించారు. ఏడేళ్ల తర్వాత టీ హబ్ రెండో దశ ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు.
ఏడేళల్లో టీహబ్ ద్వారా 1200 అంకురాలకు సహకారం అందించినట్లు చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థకు అంకురాలు దోహదం చేస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ నిర్మించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. దేశ యువతలో ఎంతో శక్తి దాగి ఉందన్నారు. యువ వ్యాపార వేత్తలను తయారు చేసి తెలంగాణ దేశంలో స్టార్టప్ ఆఫ్ స్టేట్‌గా తయారు అవుతుందన్నారు. టీ హబ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు అధికారులను అభినందించారు.
టీ హబ్ నేషనల్ రోల్ మోడల్ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ స్టార్టప్ పాలసీ స్పష్టంగా ఉందని వెల్లడించారు. స్టార్టప్‌లకు ప్రభుత్వమే ప్రోత్సహించడం తెలంగాణలోనే ప్రారంభమైందన్నారు. స్టార్టప్‌ల ద్వారా అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థకు అంకురాలు దోహదం చేస్తాయన్నారు. టీ హబ్‌లో ఇప్పటికే చాలా కంపెనీలు తమ ప్రొడక్టులను ప్రారంభించాయని పేర్కొన్నారు. సక్సెఫుల్ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.
టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన తర్వాత టీ హబ్-2 ప్రాంగణాన్ని కేసీఆర్ పరిశీలించారు. టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. యూనికార్న్ వ్యవస్థాపకులు, ప్రముఖ అంకుర సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి సన్మానించారు. టీ హబ్ 2ను ప్రభుత్వం రూ.400 కోట్ల పెట్టుబడితో 3ఎకరాల విస్తీర్ణంలో నిర్మించింది. ఇందులో ఒకేసారి 2 వేలకు పైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశముంది. తొలి దశతో పోలిస్తే ఐదు రెట్లు పెద్దదైన రెండోదశ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ గా అవుతుంది. పది అంతస్తుల్లో టీ–హబ్ రెండో దశ నిర్మాణం కాగా.. ప్రస్తుతానికి ఐదు అంతస్తుల్లో కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఇందులో ఆఫీసులు ఏర్పాటు చేయాలనుకునే వెంచర్ క్యాపిటలిస్టులు, స్టార్టప్ లు, ఇతర సంస్థలను నిపుణుల బృందం ఎంపిక చేస్తుంది.