By: ABP Desam | Updated at : 16 Apr 2022 07:51 PM (IST)
ఆవిర్భావ దినోత్సవానికి టీఆర్ఎస్ రెడీ !
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ( TRS )మరోసారి ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయిచింది. ఏప్రిల్ 27వ తేదీన మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ప్లీనరీ సమావేశం నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం. 2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ ను ప్రకటించారు కేసీఆర్ ( KCR ) . ఈ ఏడాదికి 21 ఏళ్లు అవుతుంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ నిర్వహిస్తూ ఉంటారు. మొదట ప్లీనరీ ఆ తర్వాత భారీ బహిరంగసభ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా నిర్వహించలేకపోయారు. కానీ హుజురాబాద్ ఉపఎన్నికకు ముందు అక్టోబర్ చివరి వారంలో హెచ్‌ఐసీసీలోనే నిర్వహించారు.
నిజామాబాద్ బీజేపీలో వర్గపోరు, ధన్ పాల్ పై చేయి చేసుకున్న ఎండల
వ్యవస్థాపక దినోత్సవానికి పరిమితంగానే ఆహ్వానాలు పంపుతున్నారు. రాష్ట్ర మంత్రి వర్గంతో పాటు రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధఉలు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులు ఉన్న వారు, జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులు అందర్నీ ఆహ్వానిస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజున ఉదయం 11:05 గంటలకు అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగం ఉంటుంది. దాదాపు 11 తీర్మానాలు ప్రవేశపెట్టి వాటి పై చర్చించి ఆమోదిస్తారు.
తల్లీకొడుకుల ఆత్మహత్య - రామాయంపేట మున్సిపల్ చైర్మన్ సహా ఏడుగురిపై కేసు నమోదు, పరారీలో నిందితులు
గత అక్టోబర్‌లో ప్లీనరీ అయిపోయిన తర్వాత వరంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహిచాలనుకుకున్నారు. ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాయిదా వేశారు. ఆ తర్వాత ఆ సభ నిర్వహించలేదు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తారేమోనని టీఆర్ఎస్ క్యాడర్ అనుకున్నారు . అయితే ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా హెచ్‌ఐసీసీకే పరిమితం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. బహిరంగసభ ఆలోచన చేయలేదు.
కేసీఆర్‌కు బండి సంజయ్ ఓపెన్ లెటర్, చర్చకు ఎప్పుడు వస్తారంటూ సవాల్
ప్రస్తుతం జాతీయ రాజకీయాల విధానాల రూపకల్పనలో కేసీఆర్ బీజీగా ఉన్నారు. రైతు పాలసీని ఆయన ఖరారు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. మరోసారి ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో బీజేపీయేతర ముఖ్యమంత్రులతో భారీ బహిరంగసభను తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం బహిరంగసభ ఆలోచనను పక్కన పెట్టినట్లుగా చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని క్యాడర్ వారి వారి గ్రామాల్లోనే జెండా ఆవిష్కరణల ద్వారా చేసుకోనుంది.
Breaking News Live Updates : ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం
CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు
Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Gold Silver Price Today 20th May 2022 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కాస్త తగ్గిన వెండి ధరలు, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Weather Updates : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి