అన్వేషించండి

Kavitha: కేసీఆర్‌కు బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లు - కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోం - కవిత కీలక ప్రకటన

Kalvakuntla Kavitha: కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎంతో.. జాగృతి కూడా అంతేనని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

KCR  Jagruti : కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణకు ఇచ్చినట్లేనని కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. జాగృతి స్వతంత్రంగా పని చేస్తుందని అన్నారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎలాంటిదో.. తెలంగాణ జాగృతి కూడా అలాంటిదేనన్నారు. బీఆర్ఎస్ , జాగృతి కేసీఆర్ కు రెండు కళ్లు అని స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు. కేసీఆర్ పిడికిలి బిగిస్తేనే తెలంగాణ వచ్చిందని అలాంటి నేతకు నోటీసులు ఇవ్వడం ఏమిటన్నారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని.. కాంగ్రెస్ కమిషన్ అని తెలంగాణను అవమానించారని స్పష్టం చేశారు. 

తెలంగాణ జాగృతిని పద్దెనిమిదేళ్ల కిందట ప్రారంభించామన్నారు.   తెలంగాణ ప్రతి ఉద్యమంలోనూ జాగృతి భాగమైందని గుర్తు చేశారు.   కేసీఆర్, ప్రొ.జయశంకర్ స్ఫూర్తితోనే జాగృతి ఏర్పాటైందని స్పష్టం చేశారు.   ప్రొ.జయశంకర్ చెప్పిన తర్వాతే తెలంగాణ జాగృతి స్థాపించామని..  ఆయనే తనకు  దిశానిర్దేశం చేశారని కవిత తెలిపారు. ఇకపై కొత్త కార్యాలయం నుంచే జాగృతి కార్యకలాపాలు జరుగుతాయన్నారు. 

తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసినందుకు.. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారా ..కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోం. గోదావరి జలాల్లో వాటా కాపాడకపోతే.. తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కనీసం  జై తెలంగాణ అని కూడా అనరన్నారు. . రేవంత్ ఇప్పటికైనా జై తెలంగాణ అని నినదించాలన్నారు.  తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు అమరవీరులకు నివాళులర్పించాలి. నివాళులర్పించని వారికి కుర్చీలో కూర్చునే అర్హత లేదని కవిత అన్నారు. 

ఉద్యమకారులపైకి గన్ తీసుకెళ్లిన వాళ్లు.. ప్రస్తుతం రాష్ట్రానికి సీఎం అయ్యారని  మండిపడ్డారు.  తెలంగాణ పథకాలకు తెలంగాణ వారి పేర్లే పెట్టాలని కానీ రేవంత్ రెడ్డి ఇతరుల పేర్లు పెడుతున్నారని మడంిపడ్డారు.   తెలంగాణ యువ వికాసం అని ఉండాలి.. రాజీవ్ యువవికాసం అని కాదు. వేరే రాష్ట్రం తెలంగాణ నీళ్లు తీసుకెళ్తుంటే మాట్లాడలేని పరిస్థితి రేవంత్‌దన్నారు.  బనకచర్ల ప్రాజెక్ట్‌పై రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదు. గోదావరి నీళ్లు శాశ్వతంగా దూరం కాబోతున్నాయన్నారు.   

జాగృతికి ప్రత్యేకంగా కార్యాలయం ప్రారంభించి ఇక బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా కార్యకలాపాలు నిర్వహించాలని అనుకోవడంతో .. కవిత సొంత పార్టీ దిశగా మరో అడుగు ముందుకేసినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కేసీఆర్ ఆశీస్సులతోనే తాను ఈ రాజకీయ అడుగులు వేస్తున్నానన్నట్లుగా కవిత వ్యవహరిస్తున్నారు.  జాగృతి కూడాకేసీఆర్ కు  బీఆర్ఎస్ అంత సమానం అని చెప్పడం ద్వారా .. కేసీఆర్ వ్యతిరేకించబోరన్న సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నదానిపై కవిత రాజకీయ వ్యూహం అధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు.                

టాప్ హెడ్ లైన్స్

MCGS MSME Scheme: మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. పూచీకత్తు లేకుండా రూ.100 కోట్ల వరకు లోన్.. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. పూచీకత్తు లేకుండా రూ.100 కోట్ల వరకు లోన్.
Breaking News: సీజేపీ కార్యకర్తలపై టియర్ గ్యాస్ ప్రయోగం.. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత
సీజేపీ కార్యకర్తలపై టియర్ గ్యాస్ ప్రయోగం.. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత
Trainee IPS Suicide Attempt: లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
Parliament Seat Redistribution: డీలిమిటేషన్ పజిల్ - యూనిఫాం 50% ఫార్ములా కు దక్షిణాది సై.. నియోజకవర్గాల పునర్విభజనపై మారిన పొలిటికల్ మైండ్‌సెట్!
డీలిమిటేషన్ పజిల్ - యూనిఫాం 50% ఫార్ములా కు దక్షిణాది సై.. నియోజకవర్గాల పునర్విభజనపై మారిన పొలిటికల్ మైండ్‌సెట్!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget