Ask Kavitha: సీఎం అవగానే నేను చేసే మొదటి పని అదే - నెటిజన్ల ప్రశ్నలకు కవిత సమాధానాలు
Jagruthi Kavitha: నెటిజన్లతో కవిత గంట సేపు ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు

Kavitha interacted with netizens for an hour: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ట్విట్టర్‌లో గంట సేపు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆస్క్ కవిత అనే హ్యాష్ ట్యాగ్ తో ముందుగానే ప్రచారం చేసి..ప్రశ్నలు అడగాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున అడిగిన ప్రశ్నలకు.. కవిత సమాధానాలు ఇచ్చారు. తెలంగాణకు సంబంధించిన కీలకమైన అంశాలపై సమాధానాలు ఇచ్చారు.
ఓ నెటిజన్ ముఖ్యమంత్రి అయితే ప్రాధాన్యత అంశంగా ఏది తీసుకుంటారని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా కవిత.. ఉచిత చదువుల తెలంగాణనే తీసుకుంటానని చెప్పారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు రూపాయి కూడా కట్టకుండా చేయాలనుంటానని తెలిపారు.
I want to make it a state where zero money will be spent on education by Telangana parents !! Free education is the only way to empower the future of Telangana & India https://t.co/nEG2cjUMqU
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025
రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూడంటపైనా కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తన యాత్రలో కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను కలిశానన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇలా జరుగుతున్నాయని ఆరోపించారు.
It is really unfortunate that farmer suicides are continuing in Telangana. I have met a cotton farmer's family in Adilabad who had succumbed to the heat debt accrued due to crop loss.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025
Farmer suicides are the direct reflection of government's neglect & apathy https://t.co/fIFv1k5UFL
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అభిప్రాయం చెప్పాలని ఓ నెటిజన్ కోరారు. దానికి కవిత మూడు ముక్కల్లో సమాధానం ఇచ్చారు.
Broken promises
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025
Failed commitments
People absolutely are dissappointed with the government !! https://t.co/U8CNf1XFIg
జాగృతి సంస్థపై మరికొంత మంది ప్రశ్నలు అడిగారు. జాగృతిని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పని చేసేలా తీర్చిదిద్దుతానని కవిత తెలిపారు.
Absolutely ! We need to be inclusive and empower every section of the society. It reflects in our Jagruthi committees. https://t.co/VY0s6vzIop
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025
జాగృతి సభ్యత్వాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
That plan is on the cards .. will announce the dates after the #JagruthiJanamBaata tour https://t.co/Qxqggg9HUz
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025
ఇంకా పలు ప్రశ్నలకు కవిత సమాధానం ఇచ్చారు. సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని తేల్చిచెప్పారు. రజలు సూచించిన పేరునే పార్టీకి పెడుతామన్నారు. తెలంగాణ సాధికారిత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించటమే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. ఉద్యోగాలతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు. సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందన్నారు. క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని చెప్పారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవటంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఆడపిల్లల చదువుకు మరణశాసనంగా మారిందన్నారు. ఇక రైతుల ఆత్మహత్యలు చాలా బాధకరమని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక వరుసగా రైతుల ఆత్మహత్యలు కొనసాగటం బాధకరమన్నారు. ప్రభుత్వం చేతగాని, నిర్లక్ష్య వైఖరిని ఇది నిదర్శనమని చెప్పారు. ఇక ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ అంటూ హడావుడి చేయటంపై మండిపడ్డారు. తర్వలోనే అక్కడి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక సింగరేణి సంస్థను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి కోసం ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు. హైదరాబాద్ లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంపై కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెస్ట్ సిటీ పై పెట్టిన శ్రద్ధ, ఈస్ట్ సిటీ ని సిటీ అభివృద్ది చేయటంలో పెట్టలేదన్నారు.
కవిత వ్యక్తిగత అభిరుచులకు సంబంధించి పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగగా...చాలా హంబుల్ గా ఉండే వ్యక్తి. మంచి డ్యాన్సర్ అన్నారు. ఐతే తాను చిరంజీవి అభిమానిని అని...చిరంజీవి తర్వాతే రామ్ చరణ్ అన్నారు. చిన్నప్పుడు ఎర్రమంజిల్ లో గడిపిన క్షణాలు తనకు చాలా సంతోషానిచ్చాయని అన్నారు. ఐతే రాజకీయాలు కాకుండా ఏదైనా బిజినెస్ పై దృష్టి పెట్టాలంటూ ఓ నెటిజన్ సూచించగా... అందుకు కవిత కూల్ గా అన్సర్ చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి చాలా నెగిటివిటీ ఉంటుందని దాన్ని పట్టించుకోకుండా మంచిగా ఆలోచించాలని సూచించారు.





















