Why Kavitha Suspend: సస్పెన్షన్ వెనుక తప్పనిసరి పరిస్థితి - కావాలనే ఇలాంటి పరిస్థితి సృష్టించుకున్న కవిత !
BRS Internal Politics: సస్పెన్షన్ వేటు వేయక తప్పని పరిస్థితిని కవిత కేసీఆర్‌కు కల్పించారు. తప్పని పరిస్థితుల్లోనే కవితపై సస్పెన్షన్ వేటు వేశారు.

Kavitha created a situation for suspension: భారత రాష్ట్ర సమితి నుంచి కవితను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాలను పెద్దగా ఆశ్చర్యపరచలేదు. గత మే నెలలోనే కవిత కుటుంబంలో, పార్టీలో తిరుగుబాటు చేశారు. తనకు ప్రాధాన్యత లేకుండా చేయడం, రాజకీయాల నుంచి విరమించుకోవాలని కుటుంబ పెద్దలు సలహాలు ఇవ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. అందుకే అప్పటి నుంచి జాగృతి తరపున రాజకీయాలు చేయడం ప్రారంభిచారు. రాను రాను ఆ గ్యాప్ పెరిగిపోయింది. చివరికి పాతికేళ్ల పార్టీ ఆవిర్భావ సభ తర్వాత ఆమె కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు రావడంతో కవిత తిరుగుబాటు వ్యవహారం బహిరంగమయింది.
లేఖ లీక్ ఆధారంగా కవిత రాజకీయం
తాను కేసీఆర్ కు రాసిన లేఖలు ఆయన చుట్టూ ఉందే దెయ్యాలే లీక్ చేశాయని ఆరోపించడం ప్రారంభించారు. అయితే కవిత .. కాంగ్రెస్ పార్టీతో కలిసి సొంత రాజకీయం చేస్తున్నారన్న అనుమానాలు బీఆర్ఎస్ పార్టీలో కొంత కాలం నుంచి ఉన్నాయి. దానికి తగ్గ ఆధారాలు వారి దగ్గర ఉన్నాయో లేవో కానీ కవితపై ఎప్పుడూ దూకుడుగా మాట్లాడలేదు. విమర్శలు చేయలేదు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో సైలెంట్ గా ఉంటూనే వస్తున్నారు. అయితే కవిత మాత్రం తన రాజకీయాలు తాను జోరుగా చేసుకుంటున్నారు.
ప్లాన్డ్ గా తెలంగాణ జాగృతి బలోపేతం
కవిత చాలా ప్రణాళికా బద్దంగా జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నాయకత్వాన్ని పెంచుకున్నారు. కొత్త నేతలకు శిక్షణ ఇస్తున్నారు. నమ్మకమైన కార్యకర్తలను దరి చేర్చుకున్నారు. ఇప్పుడు ఆమె సొంత రాజకీయాలు చేయాలంటే బలమైన కారణంతో ప్రజల ముందుకు రావాల్సింది. అందుకే కాళేశ్వరంపై సీబీఐ రిపోర్టును ఉపయోగించుకుని మీడియా ముందుకు వచ్చారు. కేసీఆర్ పై చాలా అభిమానం చూపిస్తూ.. హరీష్, సంతోష్ లను టార్గెట్ చేశారు.
సస్పెండ్ చేయక తప్పని పరిస్థితి కల్పించిన కవిత
హరీష్, సంతోష్‌లపై ఆరోపణలు చేసిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మరో మార్గం లేకుండా పోయింది. కవితపై చర్యలు తీసుకుంటే.. హరీష్, కవితలకు గౌరవం ఇచ్చినట్లుగా. తీసుకోకపోతే వారికి పార్టీలో ప్రాధాన్యత లేనట్లే అవుతుంది. కవిత సొంత పార్టీ కోసం రెడీ అయిపోయిన సమయంలో ఇద్దరు నేతల్ని వదులుకోలేరు.అందుకే కవితపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో తనకు చోటు లేదని ఎప్పుడైన కవిత.. ఖచ్చితంగా ఇలాంటి ఎఫెక్ట్ కోసమే చస్తున్నారు. తనంతట తాను బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటే ఎఫెక్టివ్ గా ఉండదు..కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరవాత పార్టీ పెట్టుకుంటే ప్రజల్లో సానుభూతి వస్తుంది. ఆ గోల్ ను కవిత సాధించారు.
కవిత ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్రదర్శించవచ్చు. పార్టీని కేటీఆర్, హరీష్ ను నాశనం చేస్తున్నారని..తన తండ్రికి చెడ్డపేరు తెస్తున్నారని ప్రచారం చేసే అవకాశం ఉంది. ఆమెకు రాజకీయంగా ఎన్ని అవకాశాలు వస్తాయన్న సంగతిని పక్కన పెడితే .. కేసీఆర్ కుటుంబం మాత్రం రెండుగా చీలిపోయింది.





















