BRS Suspends MLC Kavitha: ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ వేటు.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన
ఎమ్మెల్సీ కవితపై వేటుపై క్లారీటీ వచ్చేసింది. కవితను పాార్టీ నుండి సాగనంపేందుకు తండ్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. BRS నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది..

BRS party Suspension over MLC Kavitha | హైదరాబాద్: అంతా ఊహించిందే జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసేందుకు పార్టీ అధినేత , కవిత తండ్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో పార్టీ క్రమశిక్షణా కమిటీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్లు సోమభరత్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొంతకాలం నుంచి కవిత వ్యవహారం పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని బీఆర్ఎస్ నుంచి ఆమెపై వేటు వేశారు. కవిత చేసే వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు.
కొంతకాలం నుంచి కవిత ధిక్కార స్వరం..
ఎమ్మెల్సీ కవిత బిఆర్ ఎస్ లో కొనసాగుతూనే గత కొంత కాలంగా పార్టీకి వ్యతిరేకంగా మాాట్లడుతున్నారు. ఏకంగా తన తండ్రి , బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించే స్దాయిలో ఆమె కామెంట్స్ పీక్స్ కు చేరుకున్నాయి. పార్టీలు దేయ్యాలు కేసీఆర్ ను నడిపిస్తున్నాయంటూ మొదలైన కవిత ధిక్కార స్వరం , అక్కడితో ఆగలేదు.. అనేకసార్లు పార్టీ విధానాలపై, పార్టీలో కీలక నేతలపైన తీవ్ర స్దాయిలో బహిరంగ విమర్శలు చేస్తూ వచ్చారు. తన తండ్రి దేవుడు అంటూనే ,కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉన్న నేతలపై విరుచుకుపడ్డారు. 
హరీష్ రావుపైనే సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలా..
ఇన్నాళ్లు పార్టీలో కీలక నేతల పేర్లు ప్రస్తావించని కవిత, తాజాగా మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు, పార్టీలో నెంబర్ త్రీగా చెప్పుకునే హరీష్ రావుపై మీడియా ముందు పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. కాలేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అంటూనే, సంతోష్ , హరీష్ రావు కలసి, తన తండ్రి కేసీఆర్ ను తప్పుదోవ పట్టించారని, వారివల్లనే కాలేశ్వరంలో అవినీతి మరకలు కేసీఆర్ కు అంటుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి స్వార్ధం కోసమే కేసీఆర్ ను బలిచేశారని ఆరోపించడం తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ సునామీని సృష్టించారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి బిఆర్ ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ పార్టీ పరువు గంగలో కలిపినంత పనిచేశారు కవిత..
పార్టీ నేతల అభిప్రాయంతో ఏకీభవించిన కేసీఆర్.. కవితపై వేటు
కవిత వ్యాఖ్యల తరువాత బీఆర్ఎస్ లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు భరించింది చాలు. కేసీఆర్ కూతురు కాబట్టే ఓపిక పట్టాం. ఇంక పంపేద్దాం ...పార్టీ నుండి. ఆమె మాకొద్దు మహా ప్రభో అంటూ తీవ్ర స్దాయిలో పార్టీ కేడర్ నుండి, ముఖ్య నేతల నుండి కేసీఆర్ పై ఒత్తిడి పెరిగింది. మరోవైపు మీడియా సైతం కేసీఆర్ కూతురు కాబట్టే చర్యలు తీసుకోవడంలేదుంటూ ఉతికి ఆరేస్తోంది. ఈ నేపధ్యంలో రంగంలోకి దిగిన కేసీఆర్ ముఖ్యనేతలతో చర్చించి , ఓ క్లారిటీ వచ్చినట్లుగా సమాచారం. కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూతురు కదా అని ఊరుకుంటే, ఇన్నాళ్లు కాపాడుకున్న పార్టీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించిన , పార్టీ కంటే కూతురేం ఎక్కువ కాదనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు.
పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసినట్లు ప్రకటనలో తెలిపారు. సస్పెండ్ చేయాడనికి కారణాలు చెబుతూ అటు కవితపై తీవ్ర స్దాయి విమర్శల జోలిికి వెళ్లకుండా, పార్టీపై కవిత వ్యాఖ్యలకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నాం., ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాం అని స్పష్టత వచ్చింది.





















