అన్వేషించండి

Telangana News: స్మార్ట్ సిటీ మిషన్​గడువు పొడిగింపు - రేవంత్​రెడ్డి చొరవతో స్పందించిన కేంద్రం

Smart City Mission | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ మేరకు కేంద్ర ప్రభుత్వం వరంగల్, కరీంనగర్ ల స్మార్ట్ సిటీ మిషన్ ను 2025 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్రానికి లేఖ రాసింది.

Warangal Karimnagar Smart City Mission | హైదరాబాద్: స్మార్ట్ సిటీ మిష‌న్ ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా జూన్ 24న కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహల్లాల్ ఖట్టర్ ను కలిశారు.  స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని 2025 జూన్ నెల వరకు పొడిగించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ఈ జూన్ నెలతో ముగియనున్న గడువు 
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితి ఈ జూన్ నెలతో ముగియనుంది. తెలంగాణలో వరంగల్, కరీంనగర్​నగరాల్లో కేంద్రం సూచనతో స్మార్ట్ మిషన్  పనులు చేపట్టారు. వరంగల్ లో ఇప్పటివరకు 45 పనులు పూర్తి కాగా, 518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు జరుగుతున్నాయి. కరీంనగర్ లో ఇప్పటివరకూ 25 పనులు పూర్తయ్యాయి. రూ. 287 కోట్లతో చేపట్టిన 22 పనులు కరీంనగర్ లో జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి తెలిపారు.

అయితే ప్రస్తుతం కొనసాగుతున్న స్మార్ట్ సిటీ మిషన్​గడువు ముగుస్తున్నా.. స్ట్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన పనులు పూర్తి కాలేదని, ప్రజా ప్రయోజనాల కోసం పనులు పూర్తయ్యే వరకు  గడువు పొడిగించాలని కేంద్రాన్ని రేవంత్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ పై స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు శనివారం సంబంధిత రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే ఆమోదం పొంది, నిధులు కేటాయించిన పనులను కొనసాగించాలన్నారు. దాంతో పాటు కొత్త పనుల మంజూరు ఉండవని ఈ లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం కరీంనగర్, వరంగల్ లలో జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిన విడుదల చేయనున్నారు.  కనుక ఆ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించింది. 
Also Read: కమీషన్లు తీసుకుంటే ఖబర్దార్, కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget