Gangula Kamalakar: అభివృద్ధిలో దూసుకుపోతున్న మంత్రి గంగుల కమలాకర్ సొంతూరు పైడిపల్లి
పుట్టిన ఊరును జీవితాంతం మరువలేనని, ఎక్కడికెల్లినా పైడిపల్లి బిడ్డననే చెప్తానన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకునేనని, పుట్టిన ఊరును జీవితాంతం మరువలేనని, ఎక్కడికెల్లినా పైడిపల్లి బిడ్డననే చెప్తానన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. సోమవారం జగిత్యాల జిల్లా, వెల్గటూరు మండలం పైడిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తన తండ్రి గంగుల మల్లయ్య నెలమాసిక కార్యక్రమంలో సహచర మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పాల్గొన్నారు. 12 కోట్లతో పైడిపల్లి-చెగ్యామ్ 1.40కోట్లతో పైడిపల్లి - పడకల్ రోడ్డు నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ నడిబొడ్డున బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రులు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తలాపున గలగలా గోదారి పోతున్నా నాడు మన బాయిలు ఎండిపోయి, చెరువులు నిండక పంటలు ఎండిపోయేవని, అరిగోస పడి పండించిన పంటకు కూడా గిట్టుబాటు దర రాకపోయేదని వాపోయారు, అరిగోస పడుతున్న తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించారని, ఆ తర్వాత తెలంగాణ దేశానికే మార్గదర్శనం అయ్యేలా పరిపాలిస్తున్నారన్నారు. మేడిగడ్డ తలాపున గోదారిని కాలడ్డం పెట్టి ఆపినట్టు కాళేశ్వరం ద్వారా నీటిని మల్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. గతంలో ధాన్యం అమ్ముకుందామంటే క్యాష్ కటింగ్ ఉండేదని, దళారుల దందాలుండేవని, దీంతో అప్పులకు మిత్తిలు పెరిగి పొలాలు అమ్ముకునే పరిస్థితి ఉండేదని, కానీ నేడు గిట్టుబాటు ధరతో చివరిగింజవరకూ కొంటున్న ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ అన్నారు మంత్రి గంగుల.
ధాన్యంలో గింజ కూడా తరుగు పెట్టకూడదు
రైతులు ఎప్ఏక్యూతో తెచ్చిన ధాన్యంలో గింజ కూడా తరుగు పెట్టకూడదని, అక్కడే ఉన్నకలెక్టర్ ఇతర ఉన్నతాధికారులకు ఆదేశాలను సైతం జారీ చేసారు మంత్రి గంగుల. ఒకనాడు కూతురు పెళ్లికోసం పుట్టింట్లో చేయిచాచినా, అన్నదమ్ములను అడిగినా రూపాయి పుట్టలేదని, నేడు కేసీఆర్ స్వయానా మేనమామలా కళ్యాణలక్ష్మీ అందింస్తున్నారన్నారు మంత్రి. తెలంగాణ రాష్ట్రం వచ్చినందునే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినందునే కాళేశ్వర జలాలు, కళ్యాణలక్ష్మీ, 24గంటల ఉచిత కరెంటు, పుష్కలమైన సాగునీరు వచ్చాయన్నారు. వీటన్నింటిని ద్రుష్టిలో ఉంచుకొని కేసీఆర్ కి మరింత బలం అందించాలన్నారు. కడుపునిండా పెడుతున్న బీఆర్ఎస్ సర్కారుకు అండగా ఉండాలని ప్రజలను కోరారు మంత్రి గంగుల కమలాకర్. ఢిల్లీలో పరిపాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల పరిపాలన ఎంత దారుణంగా ఉందో చూస్తున్నామని, తెలంగాణపై ప్రేమలేని ఆ పార్టీల మాటల్ని నమ్మి మోసపోయామంటే తెలంగాణ మల్లీ పాత స్థితిలోకి వెల్లి గుడ్డిదీపంలా మారుతుందని, వారిని దరిచేరనీయోద్దన్నారు గుంగల.
ఎర్రబెల్లి దయాకర్ రావ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తెలంగాణ పల్లెల్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారన్న మంత్రి గంగుల. తన చిన్నప్పుడు పైడిపల్లి చెక్ డాం పోవాలంటే దారి లేకుండా ఉండేదని, ఆ కొరత తీర్చి అంబారిపేట నుండి చెగ్యామ్ వరకూ 12 కోట్ల విలువగల రోడ్డును మంజూరు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. అదే సందర్భంలో బ్రిడ్జికి సమాంతరంగా ఉండే చెరువుకట్ట కిందనున్న మరో బ్రిడ్జిని మంజూరు చేయాలని కోరారు. పైడిపల్లి గ్రామస్థులకు అనువుగా ఉండే విదంగా అన్ని కులాలవారు ఉచితంగా పంక్షన్లు నిర్వహించుకునే విదంగా మల్టిపర్పస్ పంక్షన్ హాళ్ నిర్మానానికి తమ కుటుంభం తరుపున భూమిని ఇస్తామన్న మంత్రి గంగుల దానిని నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని సభాముఖంగా మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావును కోరారు. దానిపై తన పరిధిలోగల బ్రిడ్జిని తక్షణమే మంజూరు చేస్తాన్నన్న ఎర్రబెల్లి, కమ్యూనిటీ హాళ్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్తామన్నారు.
ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో పైడిపల్లి చేరుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రులు గంగుల, కొప్పుల ఘన స్వాగతం పలికారు, అనంతరం గ్రామస్థులు మంత్రులను సాంప్రదాయ డ్యాన్స్ లు, డప్పువాయిధ్యాలతో ఘనంగా ఊర్లోకి ఆహ్వానించారు. అధికారిక కార్యక్రమాల అనంతరం అక్కడే నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య నెల మాసికంలో పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి గంగుల తన సొంత గ్రామస్థులను పేరు పేరునా పలకరిస్తూ, వారి సాధక బాధకాలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. వారితో మమేకమైన మంత్రిని చూసి గ్రామస్థులు చిన్ననాటి రోజుల్ని గుర్తుకుతెచ్చుకొన్నారు. రాష్ట్రానికి మంత్రైనా పైడిపల్లి బిడ్డేఅని ఆ ఆప్యాయతలు, ప్రేమలు, ఊరికి సాయం చేయడంలో గంగుల కుటుంభం తీరును మెచ్చుకొని కొనియాడారు గ్రామస్థులు.
ఎండను లెక్కచేయకుండా ఘన స్వాగతం పలికిన పైడిపల్లి గ్రామస్థులకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. నలబై ఏళ్ల తమ రాజకీయ జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను, చాలా పార్టీలను చూసానని, కానీ ఎన్టీఆర్, కేసీఆర్ లా అభివృద్ధి చేస్తూ పేదల కోసం తపన పడ్డవారే కనపడలేదన్నారు. నాడు 2రూ కిలో బియ్యం, పింఛన్ అందిస్తే దానికి సీక్వేల్ గా కేవలం కేసీఆర్ మాత్రమే పనిచేస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తూతూమంత్రంగా పింఛన్ అందిస్తే ఇక్కడ స్వాభిమానంతో బతికేలా 2000 రూపాయలు కేవలం కేసీఆర్ మాత్రమే ఇస్తారన్నారు, నీరు, కరెంట్, రోడ్లు వంటి సకల సౌకర్యాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పింస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లాపరిషత్ చైర్మన్ పుట్టమదు, కలెక్టర్ యాస్మిన్ బాష, ఎస్పీ బాస్కర్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పైడిపల్లి గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.