అన్వేషించండి

Siddipet Murder Case: బెట్టింగ్‌ మాయలో పడి కానిస్టేబుల్ అప్పులు! భార్యతో కలిసి చోరీలు, మర్డర్‌లు! సిద్దిపేటలో దారుణం!

Siddipet Murder Case: సిద్దిపేట జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌ వలలో పడి దారుణాలకు తెగబడ్డాడు. వద్దని వారించాల్సిన భార్య నేరాల్లో భాగమైంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన కానిస్టేబుల్, భార్యతో కలిసి దంపతులు అరెస్ట్.
  • రుణాలు తీర్చేందుకు రియల్టర్‌ను కారులో హత్య చేసి, నగలు దొంగిలించారు.
  • హత్య అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి, నగలు హైదరాబాద్‌లో అమ్మారు.
  • విచారణలో కానిస్టేబుల్‌పై వృద్ధురాలి బంగారు నగలు దొంగతనం కేసు కూడా వెలుగులోకి.

Siddipet Murder Case: సిద్దిపేట సీసీఎస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గౌటి ప్రవీణ్‌ కుమార్, గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. 2007లో విధుల్లో చేరిన ఇతను, సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉండి కూడా ఆన్‌లైన్ బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయాడు. 

ప్రవీణ్ కుమార తన భార్య రజితతో కలిసి గత రెండేళ్లుగా విపరీతంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడుతూ సుమారు 60 లక్షల వరకు నష్టపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో రూ. 30 లక్షల వరకు అప్పుల పాలై, వాటిని తీర్చే మార్గం లేక నేరాల బాట పట్టారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తమకు తెలిసిన వారినే లక్ష్యంగా చేసుకొని కుట్రలు చేశారు. 

రియల్టర్ విశ్వనాథం హత్య

ఈ కేసులో ప్రధాన  బాధితుడు సిద్ధిపేటకు చెందిన రియల్టర్‌ బెల్దె విశ్వనాథం. ప్రవీణ్‌ కుమారు తన తమ్ముడికి చెందిన ఒక స్థలాన్ని విశ్వనాథం బంధువు వద్ద తాకట్టు పెట్టించి 12 లక్షల అప్పు ఇప్పించాడు. అయితే ఆ ప్లాటును విక్రయించాలని విశ్వనాథం చెప్పగా, ప్రవీణ్ అందుకు నిరాకరించి, మోర మంచి ప్లాటు చూపిస్తానని నమ్మించాడు. 

గత శనివారం పథకం ప్రకారం, ప్రవీణ్ రజిత ఇద్దరూ విశ్వనాథాన్ని తమ కారులో ఎక్కించుకొని మెట్టుబండల శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులోనే ఉన్న సమయంలో విశ్వనాథం కాళ్లూచేతులు కట్టేసి మెడ చుట్టూ వైరు బిగించి అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం అతని ఒంటిపై ఉన్న సుమారు పది తులాల బంగారు నగలను దొంగిలించారు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇమాంబాద్‌ సమీంపలోని ఒక కాలువలో పడేశారు. ఆ తర్వాత దంపతులిద్దరూ కారులో నేరుగా హైదరాబాద్‌ వెళ్లి, అక్కడ ఒక బంగారు దుకాణంలో నగలను విక్రయించారు. 

కానిస్టేబుల్ దంపతులు ఎలా దొరికారంటే?

విశ్వనాథం కనిపించకపోవడంతో అతని భార్య వనిత చిన్నకోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం రాత్రి మృతదేహాన్ని గుర్తించారు.ఏసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు. 

పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు విశ్లేషించారు. టెక్నికల్ అనాలసిస్ ఆధారంగా విచారణ జరపగా, ప్రవీణ్ కుమార్ కారు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. గట్టిగా విచారించడంతో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. మంగళవారం వీరిని అరెస్టు చేసి, బుధవారం రిమాండ్‌కు తరలించారు. 

వృద్ధురాలి నగలు చోరీ 

విశ్వనాథం హత్య కేసు దర్యాప్తులో ప్రవీణ్ కుమార్ చేసిన మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. గత నెల 25న తన ఇంటికి సమీపంలో ఉండే నర్సవ్వ అనే వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్తానని కారులో ఎక్కించుకున్నారు. దారి మధ్యలో ఆమెను ఏమార్చి, మెడలోని బంగారు పుస్తెల తాడు చోరీ చేశారు. బంగారం పోయిందని ఏడుస్తున్న వృద్ధురాలిని స్వయంగా ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు. ఎవరికీ తెలియకుండా డ్రామా ఆడాడు. దొంగిలించిన నగలను కూడా హైదరాబాద్‌లో విక్రయించాడు. 

Frequently Asked Questions

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన కానిస్టేబుల్‌ ఎవరు?

సిద్దిపేట సీసీఎస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గౌటి ప్రవీణ్‌ కుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు.

ప్రవీణ్‌ కుమార్, అతని భార్య ఎంత డబ్బు నష్టపోయారు?

ప్రవీణ్‌ కుమార్, అతని భార్య రజిత కలిసి సుమారు 60 లక్షల వరకు ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో నష్టపోయారు.

రియల్టర్‌ విశ్వనాథం హత్యకు కారణం ఏమిటి?

అప్పుల తీర్చడానికి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో, ప్రవీణ్‌ కుమార్, అతని భార్య రజిత కలిసి విశ్వనాథాన్ని హత్య చేశారు.

హత్య తర్వాత దంపతులు ఏం చేశారు?

హత్య అనంతరం విశ్వనాథం ఒంటిపై ఉన్న బంగారు నగలను దొంగిలించి, వాటిని హైదరాబాద్‌లోని ఒక దుకాణంలో విక్రయించారు.

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget