Fishes in Karimnagar: కరీంనగర్ లో చేపలే చేపలు, మార్కెట్లన్నీ సందడి!
Fishes in Karimnagar: గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి చెరువులో అనేక రకాల చేపలు సందడి చేస్తున్నాయి. మత్స్యకారులు వాటిని పట్టుకొని అక్కడే అమ్మేస్తున్నారు.
Fishes in Karimnagar: గత పది రోజులుగా కురిసిన భారీ వర్షానికి కరీంనగర్ జిల్లా మొత్తం తడిసి ముద్దయిపోయింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఉద్ధృతంగా వరదలు పోటెత్తాయి. చెరువులు, వాగులు, వంకలు నిండి పొంగి పొర్లుతున్నాయి. దీంతో కరీంనగర్ జిల్లాలో వివిధ రకాల చేపలు సందడి చేస్తున్నారు. ఏ చెరువు వద్ద చూసినా రకరకాల చేపలు కనిపిస్తున్నాయి. దీంతో మత్స్యకారులంతా చెరువుల వద్దకు చేరుకొని చేపలను పడుతున్నారు. వాటిని పట్టుకొని అక్కడికక్కడే విక్రయాలు చేపడుతున్నారు. వీటిని చూసేందుకు, చేపలు కొనేందుకు చాలా మంది చెరువులు, నదుల వద్దకు వెళ్తున్నారు.
కొత్తపల్లి చెరువులో రకరకాల చేపలు..
కరీంనగర్ జిల్లా నుంచి నిజామాబాద్ వెళ్లే రూట్ లో ఉన్న కొత్తపల్లి చెరువు నిండు కుండలా మారింది. ఎగువ ప్రాంతం నుంచి నీరు భారీ ఎత్తున వరదగా వస్తోంది. దీంతో చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో మత్స్యకారులు అక్కడి చెరువుకు వద్దకు చేరుకొని వలల వేసి చేపలు పడుతున్నారు. ఈ దృశ్యాలు రోడ్డుపై వెళ్తుంటే చాలా బాగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కురిసిన వర్షాల వల్లే రకరకాల చేపలు కనిపిస్తున్నాయని మత్స్యకారులు అంటున్నారు. అలాగే చెరువు వద్దే ఫ్రెష్ గా పట్టిన చేపలను కొనుక్కోవడం, మనకు నచ్చిన రకాల్ని ఎంచుకునే వీలుండటం చాలా బాగుందని అంటున్నారు.
ప్రజలకు రకరకాల చేపలు అందిస్తున్నాం..
గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ మొత్తంలో చేపలు దొరుకుతున్నాయని కొత్తపల్లి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సిటీలో ఉండే మార్కెట్లకు వచ్చే జనాలు ఇప్పుడు కొత్త పల్లి వైపు వస్తున్నారని వారికి బొమ్మే లు, రవ్వులు, ఇతర వెరైటీల లైవ్ ఫిష్ లను అతి తక్కువ ధరకు దొరుకుతున్నాయని చెప్తున్నారు.
నీట మునిగిన వేల ఎకరాల పంట..
కానీ రాష్ట్రంలో భారీగా కురిసిన వరదల వల్ల చాలా మంది అన్నదాతలు నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా వేలాది రైతులకు భారీ వర్షం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది .కౌలుకు తీసుకొని ముందస్తు నాటిన రైతులు ఈ సారి మొదట్లోనే లక్షలు నష్టపోయారు. తొలకరి జల్లు సంబరాలు జరుపుకోవాలని అనుకున్న రైతులకు వరుణదేవుడు పట్టు పట్టినట్టుగా వారం రోజుల పాటు వర్షాలు కురవడంతో పొలాలన్నీ నామ రూపాలు లేకుండా ధ్వంసం అయ్యాయి. ఇక వర్షం తరువాత ఉన్న బురద ని తొలగించాలంటే కనీసం ఆరునెలల సమయం పడుతుంది లేదంటే రెండు పంటలు నష్టం జరుగుతుంది..
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాల పరిధిలో దాదాపు వేల ఎకరాల్లో పంట వర్షానికి నీట మునిగింది. జగిత్యాల సిరిసిల్ల లో ఈ బెడద ఎక్కువగా ఉంది పెద్దపల్లి జిల్లా లోని 126 గ్రామాల పరిధిలో పొలాలు నీటితో తడిసిపోయాయి. 659 ఎకరాల్లో ఇటీవలే నాట్లు వేయడం తో అవి కొట్టుకుపోయాయి. 4704 ఎకరాల్లో వేసిన పత్తి పంట పూర్తిగా నాశనమైంది . కేవలం కొత్త కరీంనగర్ జిల్లాలో ఆరు వేల ఎకరాల వరకు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు అధికారులు. ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది . జగిత్యాల జిల్లాలోని 22972 ఎకరాల్లో నష్టం ఉండొచ్చని అధికారులు అంచనా ఇప్పటికే ముందస్తు తొలకరి ఆశలతో సంతోషపడి వ్యవసాయం మొదలుపెట్టిన రైతులకు ఈసారి కన్నీరే మిగిలింది.