Minister KTR: ఇళ్లు లేని పేదలకు రూ.3 లక్షలు, డిసెంబర్ నుంచే!
Minister KTR: సొంత స్థలాలు ఉండి ఇళ్లు లేని నిరుపేదలకు మూడు లక్షల రూపాయలను ప్రభుత్వం డిసెంబర్ లో ఇస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Minister KTR: సొంత స్థలాలు ఉండి ఇళ్లు లేని నిరుపేదలకు డిసెంబర్ నుంచి 3 లక్షల రూపయలు ఇవ్వబోతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈలోపే రెండు పడక గదుల ఇళ్లు మంజూరు అయి నిర్మాణాలు జరగని గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అంతే కాకుండా గతంలో ప్రవేశ పెట్టిన రూ.5.04 లక్షల పథకం మంజూరు కాని వారిని రూ.3 లక్షల పథకంలో అర్హులుగా గుర్తించాలనని అన్నారు. ఈ రెండు పథకాల్లోని వ్యత్యాసాలను ప్రజలకు అర్థమయ్యేలా స్థానిక ప్రజాప్రతినిధలు వివరించాలని చెప్పారు. ఎన్నికల నాటికి ఏ గ్రామంలోనూ ఇల్ల లేని నిరుపేదలు ఉండకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, పురోగతి, మన ఊరు - మన బడి కార్యక్రమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పురోగతి, మన ఊరు - మన బడి కార్యక్రమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ @KTRTRS గారు. @TelanganaCMO @IPRTelangana pic.twitter.com/0ZcddbZX0D
— CollRajannaSircilla (@Collector_RSL) November 29, 2022
గురుకులాలను 200 నుంచి 1000 కి పెంచాం..
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజురూ అయినా టెండర్ల వేసేందుకు గుత్తేదారులు ముందుకు రాని చోట, స్థలాల సమస్య ఉన్న చోట వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఇళ్ల పంపిణీని ఏడాదిలోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అలాగే గురుకులాల సంఖ్యను 200 నుంచి 1000 కి పెంచిన ఘనత సీఎం కేసీఆర్ ఒక్కకరిదేనని వివరించారు. రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాలకు ఎనిమిదేళ్లలో మెడికల్, ఇంజినీరింగ్, వ్యవసాయ, నర్సింగ్ కళాశాలలను మంజూరు చేసినట్లు వివరించారు. అనంతరం వేములవాడ మండలం అగ్రహారంలోని పాఠశాలలో మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను మంత్రి వివరించారు.
పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదే..
ఆ తర్వాత ముస్తాబాద్ మండల పరిధిలోనూ చీకొడు, మోర్రయిపల్లి, ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర, బండలింగంపల్లి, అక్కపల్లి, గంభీరావుపేట, తంగళ్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో మంజూరైన ఇండ్లను సాధ్యమైనంత త్వరగా గ్రౌండింగ్ చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. లాటరీ పద్దతిలో అత్యంత పారదర్శకంగా ఇండ్లను అర్హులకు కేటాయించాలని చెప్పారు. మంజూరు అయిన ఇండ్లను గ్రౌండ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలదే అని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజూరైన మొత్తం 6,886 డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. పేదల సొంతింటి కల నిజం చేయడమే కేసిఆర్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కేటీఆక్ స్పష్టం చేశారు.