News
News
X

Karimnagar: భర్త కోసం 42 రోజుల పోరాటం.. చివరికి విషాదాంతం, కన్నీరు పెట్టించే ఘటన

హుజూరాబాద్‌కు చెందిన సుజిత్‌ హన్మకొండలోని ఓ ఆసుపత్రిలో పని చేస్తుండగా కడప జిల్లాకు చెందిన ఆవుల సుహాసిని అనే 34 ఏళ్ల వ్యక్తితో ఆన్‌ లైన్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.

FOLLOW US: 
 
ఆన్ లైన్‌లో పరిచయం కాస్తా కడపకు చెందిన సుహాసినిని, హుజురాబాద్‌కు చెందిన సుజిత్‌ను కలిపింది. మాయమాటలతో నమ్మించి పెళ్లి, కట్నం అంటూ లక్షలు కాజేసిన సుజిత్, చివరికి అగ్రిమెంట్ రాసి జంప్ అయ్యాడు. న్యాయం కోసం ఆమె హుజూరాబాద్‌లో మౌనదీక్ష చేపట్టింది. 42 రోజుల దీక్ష అనంతరం తాజాగా ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మోసం చేసిన భర్త ఆచూకీ ఎలాగో తెలుసుకొని చివరి వరకూ పోరాడి ఓడిపోయింది. తనను భార్యగా స్వీకరించాలనే డిమాండ్‌తో చేసిన పోరాటం చివరికి విషాదాంతంగానే ముగిసింది.

హుజూరాబాద్‌కు చెందిన సుజిత్‌ హన్మకొండలోని ఓ ఆసుపత్రిలో పని చేస్తుండగా కడప జిల్లాకు చెందిన ఆవుల సుహాసిని అనే 34 ఏళ్ల వ్యక్తితో ఆన్‌ లైన్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకొని 2020 నవంబర్‌ 25న హైదారాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు కాపురం చేసిన తర్వాత సుజిత్‌ తన భార్యకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. భర్తపై ఉన్న ప్రేమను చంపుకోలేక అతనే కావాలంటూ ఆ యువతి చివరికి అతని ఆచూకి కనుక్కుంది. 

భర్త తనకు కావాలంటూ హుజూరాబాద్‌లోని సుజిత్‌ ఇంటి ఎదుట నవంబర్‌ 26 నుంచి దీక్ష చేస్తోంది. అయినా అత్త తరపు వారి నుంచి ఎలాంటి ఆదరణ లేదు. చివరకు పోలీసులను ఆశ్రయించింది. న్యాయం కోసం పోరాడింది. కొన్ని రోజులపాటు పస్తులు ఉండి తన దీక్ష కొనసాగించింది. చివరికి భర్త మరో పెళ్లి చేసుకున్నాడని, వారికి పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకుంది. చేసేదిలేక బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 

ఆమెను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించగా గురువారం మృతి చెందిందని పోలీసులు తెలిపారు. అంతకు ముందు ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌‌లో.. తన మృతికి భర్త సుజిత్‌, అత్త పద్మ, కల్యాణి, మామ శ్రీనివాస్‌ రెడ్డి, మరిది సుహాస్‌ రెడ్డి కారణమని పేర్కొంది.

News Reels

Also Read: Crime News: మంటల్లో కాలిపోతున్న భర్త.. చోద్యం చూస్తూ నుంచున్న భార్య, కొడుకు.. అసలేం జరిగిందంటే..

Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!

Also Read: కొత్తగూడెం ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో మరో ట్విస్టు.. తన భార్యను ఎమ్మెల్యే కుమారుడు రమ్మన్నాడని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో

Also Read: Suryapet: సూర్యాపేటలో కిరాతక హత్య, బురదలో పడేసి.. ట్రాక్టర్ దమ్ము చక్రాలతో తొక్కించి..

Also Read: Pigeon News: భయపెడుతున్న పావురాలు.. కాలికి పసుపురంగు ట్యాగ్, దానిపై ఆ కోడ్ ఏంటి? అక్కడ కూడా ఇలాగే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 07 Jan 2022 11:04 AM (IST) Tags: huzurabad Karimnagar news Hanamkonda Karimnagar woman death wife protest for husband

సంబంధిత కథనాలు

TS News Developments Today: నేడు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ టూర్, వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

TS News Developments Today: నేడు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ టూర్, వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

Petrol-Diesel Price, 2 December 2022: పెట్రోల్ డీజిల్ ధరల్లో భారీ మార్పులు- మీ ప్రాంతంలో రేట్లు ఇవే!

Petrol-Diesel Price, 2 December 2022: పెట్రోల్ డీజిల్ ధరల్లో భారీ మార్పులు- మీ ప్రాంతంలో రేట్లు ఇవే!

Gold-Silver Price 2 December 2022: 54 వేలు దాటేసిన పసిడి- తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త బెటర్‌!

Gold-Silver Price 2 December 2022: 54 వేలు దాటేసిన పసిడి- తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త బెటర్‌!

Sri Krishna Temple: దక్షిణ అభిముఖ శైలి ఉన్న కృష్ణుడి ఆలయం- మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న అరుదైన గుడి!

Sri Krishna Temple: దక్షిణ అభిముఖ శైలి ఉన్న కృష్ణుడి ఆలయం- మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న అరుదైన గుడి!

Gold-Silver Price 1 December 2022: 54 వేల వైపు పరుగులు పెడుతున్న బంగారం- మీ ప్రాంతాల్లో రేటు తెలుసా?

Gold-Silver Price 1 December  2022: 54 వేల వైపు పరుగులు పెడుతున్న బంగారం- మీ ప్రాంతాల్లో రేటు తెలుసా?

టాప్ స్టోరీస్

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే? 

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే?