దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా కరీంనగర్ డీసీసీ
దేశంలోనే దశాబ్దపు అత్యుత్తమ సహకార బ్యాంకుగా కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ సేవలకు గుర్తింపు దక్కింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అవార్డు సైతం అందుకున్నారు.
![దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా కరీంనగర్ డీసీసీ Karimnagar KDCC cooperation bank is best bank of Decade DNN దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా కరీంనగర్ డీసీసీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/13/276e7961b07434ebb60abe96c99adcbb1660382091962233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సహకార ఉద్యమంలో విప్లవాత్మకమైన బ్యాంకుగా ఉన్న కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరో ఘన సాధించింది. దేశంలోనే అత్యంత ఉత్తమమైన పనితీరుకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. సహకార ఉద్యమం వరుస విజయాలతో రైతాంగానికి సేవలందించడమే పరమావధిగా 1904 సంవత్సరంలో స్థాపించిన కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇటీవలే శత వసంతోత్సవాలు జరుపుకుంది. ఎన్నో ఎత్తు పల్లాలను అధిగమిస్తూ ఈ బ్యాంకు గత దశాబ్ద కాలం వరకు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతూ ఉండేది.
అసలు బ్యాంకు మనుగడే కష్టమైన పరిస్థితుల్లో వరుసగా రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన కొండూరు రవీందర్ బ్యాంకు వ్యాపార సరళిని మార్చేశారు. సేవలను విస్తృతపరచి దేశంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అన్నింటిలో అగ్రగామిగా నిలిపారు. పాలకవర్గ సహకారం.. ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ ఇతర సిబ్బందితో కలిసి అద్భుతాలు సాధించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లోనే కాదు... గత దశాబ్దకాలంలోనే ముంబైలోని నాప్కాబ్ ద్వారా అత్యుత్తమ బ్యాంక్‌గా గుర్తింపు తీసుకొచ్చారు. తాజాగా దేశంలోనే ఈ దశాబ్దపు ఉత్తమ బ్యాంకుగా ఎంపికై సత్తా చాటారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అవార్డు సైతం అందుకున్నారు.
గ్రామీణ ప్రజలకు అత్యవసర సమయాల్లో సేవలు
కేడీసీసీబీ ఒకప్పుడు ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొంది. తీవ్రమైన నష్టాల ఊబిలో కూరుకుపోయింది. 2005 - 2006 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 57.72 కోట్ల నష్టాల్లో ఉండగా, 2012-13 నుంచి లాభాల బాటలో పయనిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చిన్న సన్నకారు రైతులకు అన్ని రకాల ఆర్థిక అవసరాలు తీరుస్తుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఆర్థికేతర సేవలను అందిస్తూ గ్రామీణ ప్రజలకు అత్యవసర సమయాల్లో దిక్కుగా మారింది. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పాలకవర్గం రూపొందించే మార్గదర్శకాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. వివిధ అంశాల కోసం ఏర్పడిన ప్రత్యేక కమిటీలు, వాటి నిర్ణయాలు తద్వారా చేపట్టే అన్ని రకాల సేవలు జిల్లాలోని గ్రామీణులకు కొంగు బంగారమైంది. 1,207 గ్రామాల్లోని 7.68 లక్షల ఖాతాదారుల ఆర్థిక పరిపుష్టికి వారి మేలైన జీవన విధానానికి తోడ్పాటు అందిస్తుంది. ప్రజల ఆర్థిక అవసరాలను గుర్తించి వారికి అనువైన సౌకర్యాలు చాలా సరళీకృత పద్ధతులు ఈ బ్యాంకు అందిస్తుంది.
లాభాల బాటలో కేడీసీసీ బ్యాంక్
2012లో కేవలం 29 శాతంగా ఉన్న బ్యాంకు ప్రస్తుతం 65 శాఖలకు విస్తరించింది. అప్పటి వాటా ధనం రూ .62 కోట్ల నుంచి ప్రస్తుతం 346 కోట్లకు పెరిగింది. 2012లో రూ. 271.30 కోట్ల డిపాజిట్లు ఉండగా ప్రస్తుతం 2263 పాయింట్ 68 కోట్లకు అభివృద్ధి చెందింది. బ్యాంకులో పని చేసే సిబ్బంది 165 నుంచి 483 వరకు పెరిగారు. వ్యాపారం రూ.4.47 కోట్ల నుంచి 10.14 కోట్లకు పెరిగింది. సగటున ఒక్కోచోట వ్యాపారం చూస్తే రూ. 25.4 కోట్ల నుంచి రూ. 73.14 కోట్లకు చేరింది. 2.40 శాతంగా ఉన్న నిరర్ధక ఆస్తులు 1.2 శాతానికి తగ్గాయి. 2011-12 ఆర్థిక సంవత్సరం నాటికి నికర నష్టం రూ. 563.43 లక్షలు కాగా, 2021 22 ఆర్థిక సంవత్సరం నాటికి లాభం 2,142.38 లక్షలు ఆర్జించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)