News
News
X

Forbes India: గోదావరిఖని యువకుడి సత్తా, ఫోర్బ్స్ ఇండియాలో చోటు - ఇతను అందరికీ తెలిసిన వ్యక్తే!

Forbes India: ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రముఖ బిజినెస్ పేపర్ ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇండియాలో గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్ కి చోటు దక్కించుకున్నాడు.

FOLLOW US: 

Forbes India:  ఫోర్బ్స్ ఎంతో ప్రసిద్ధి చెందిన మేగజిన్. అందులో పేరు రావడం ఎంతో గొప్పగా భావిస్తుంటారు చాలా మంది. అందులో  కనిపించడాన్ని ఎంతో గౌరవప్రదంగా ఫీల్ అవుతుంటారు. అందులో చిన్నగా పేరు వచ్చినా ఆనందంతో ఉప్పొంగిపోతారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన మేగజిన్ లో తెలంగాణకు చెందిన యువకుడు చోటు దక్కించుకున్నాడు. 

ఈ గుర్తింపు ఏంటి?

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కోసం దీనిని ప్రారంభించింది ఫోర్బ్స్. ప్రపంచవ్యాప్తంగా  నెటిజన్లని ఆయా రంగాల్లో ఉన్న సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వారిని గుర్తించడానికి ప్రతి సంవత్సరం డిజిటల్ స్టార్స్ పేరుతో లిస్ట్ విడుదల చేస్తోంది ఫోర్బ్స్ పత్రిక. ఇందులో స్థానం దక్కించుకున్నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన యువకుడు సయ్యద్ హఫీజ్. ఈ జాబితాలో అతడు 32వ స్థానంలో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా 100 మందిని ఎంపిక చేయగా... అందులో సయ్యద్ హఫీజ్ 32వ స్థానంలో నిలవడం విశేషం. 

సయ్యద్ హఫీజ్ ఎవరు?

సోషల్ మీడియా, యూట్యూబ్ వాడే వారికి సయ్యద్ హఫీజ్ గురించి తెలిసే ఉంటుంది. అప్పుడో ఇప్పుడో ఈ కుర్రాడిని ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. కానీ అతడే సయ్యద్ హఫీజ్ అని తెలియకపోవచ్చు అంతే. ఎందుకంటే సయ్యద్ హఫీజ్ చాలా అంశాలపై సమాచారం అందిస్తాడు. టెక్నాలజీ మాత్రమే కాకుండా జనాలకు అవసరం అవుతుంది అని అతడికి అనిపిస్తే చాలూ.. దానిపై శోధన మొదలుపెడతాడు. దాని పుట్టు పుర్వోత్తరాలు ఏంటి.. దాని ఉపయోగం ఏమిటి.. దాని వల్ల జనాలకు ప్రయోజనం ఏమిటి.. అనే పూర్తి సమాచారంతో వచ్చి జనాలకు తన స్టైల్ లో వివరిస్తూ పోతాడు. అందుకే ఈ కుర్రాడికి సోషల్ మీడియా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. 

ఏమేం చేస్తాడు?

గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్ 2011లో అప్పుడప్పుడే పెరుగుతున్న టెక్నాలజీ గురించి అప్డేట్ చేయడానికి తెలుగు Tech Tuts చానల్ ప్రారంభించాడు. మొదట గోదావరిఖని లో కంప్యూటర్ ఇన్స్ స్టిట్యూట్ నడిపిన హఫీజ్ తరువాత వినియోగదారులకు సెల్ ఫోన్ కి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించే విధంగా వీడియోలు తయారు చేసి అప్లోడ్ చేసే వాడు హఫీజ్. కొత్తగా వచ్చిన ఫోన్లు ఏవి.. వాటిలో ఏమేం ఫీచర్లు ఉన్నాయో వివరించే వాడు. ఆ ధరకు ఆ ఫోన్ కొనవచ్చా.. లేదా అని చెప్పేవాడు.  కొత్త ఫోన్ బాక్స్ ను ఓపెన్ చేసి అందులో ఏమేం వస్తున్నాయో చూపించేవాడు.  కేవలం ఇదొక్కటే కాదు చాలా అంశాలపై హఫీజ్ వీడియోలు చేస్తాడు. అన్నీ జనాలకు అవగాహన కల్పించేవి, అవసరాలు తీర్చేవి, అక్కరకు వచ్చేవి అయి ఉంటాయి. సైబర్ క్రైమ్ పైన కూడా విస్తృతంగా ప్రచారం కల్పించాడు హఫీజ్. 11 ఏళ్ల కాలంలో 16 లక్షల మంది ఛానల్ సబ్స్క్రైబర్లను చేరుకున్నాడు. నెలకు కేవలం యూట్యూబ్ ద్వారానే రెండు లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు ఈ కుర్రాడు. ఇరు రాష్ట్రాల్లో తెలుగు భాష మాట్లాడే వారికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లందరికీ హఫీజ్ అందించే వీడియోలు ఎంత గానో ఉపయోగ పడ్డాయి 

వంద లో 32 వ ర్యాంకు

ఫోర్బ్స్ విడుదల చేసిన డిజిటల్ స్టార్స్ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సోషల్ మీడియా స్టార్స్ ఉన్నారు. వీరంతా వివిధ రంగాలకు చెందిన వారు. ముఖ్యంగా స్టాండప్ కామెడీ కి చెందిన ప్రముఖ వ్యక్తులతో పాటు ఎక్కువగా సామాజిక అంశాలపై పోరాడుతున్న వారు ఈ డిజిటల్ స్టార్స్ లిస్టులో స్థానం పొందారు. అయితే వాళ్లంతా ఇంగ్లీష్ లో తమ ఛానల్ ద్వారా కంటెంట్ ఇస్తుంటారు. అయితే హఫీజ్ ప్రత్యేకత ఏమిటంటే టెక్నాలజీ లాంటి రంగంలో ఉండటం. అది కూడా ఒక రీజినల్ లాంగ్వేజ్ లో పెద్ద ఎత్తున వినియోగదారులను కలిగి ఉండడమే కాకుండా వారి విశ్వాసాన్ని పొందడం. అంతేకాకుండా వరుసగా 11 ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రజలకు టెక్నాలజీపై సమాచారం అందిస్తున్నాడు హఫీజ్. ఇందుకోసం హఫీజ్ తెర వెనక చాలా కష్టపడతాడు. ఒక టాపిక్ ఎంచుకుంటే దాని గురించి చాలా సమాచారం సేకరిస్తాడు. దానినంతా ఒక చోటుకు చేర్చి దానిపై వీడియో చేస్తాడు. ఇలా నిరంతరంగా కష్టపడటం వల్లే ఇప్పుడు హఫీజ్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఒక సాధారణ సింగరేణి కుటుంబంలో పుట్టినా... తక్కువ స్థాయి చదువుల తోనే... ఈ రోజు Forbes లాంటి అత్యున్నత మ్యాగజైన్ లో చోటు సంపాదించడం పట్ల పలువురు హఫీజ్ ని ప్రశంసిస్తున్నారు.

Published at : 22 Jul 2022 09:41 AM (IST) Tags: godavari young man forbes magazine hafeez saeed in forbes list forbes list 2022 hafeez saeed telugu tech news

సంబంధిత కథనాలు

Batukamma Sarees : సెప్టెంబర్ 17 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, ఈసారి కోటికి పైగా!

Batukamma Sarees : సెప్టెంబర్ 17 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, ఈసారి కోటికి పైగా!

జగిత్యాలలో మరో చిన్నారి కిడ్నాప్, అసలేమైందంటే?

జగిత్యాలలో మరో చిన్నారి కిడ్నాప్, అసలేమైందంటే?

Computer Education: కంప్యూటర్ విద్యకి ప్రభుత్వ విద్యార్థులు దూరం, మళ్లీ పాత రోజులేనా ! ఎందుకీ దుస్థితి

Computer Education: కంప్యూటర్ విద్యకి ప్రభుత్వ విద్యార్థులు దూరం, మళ్లీ పాత రోజులేనా ! ఎందుకీ దుస్థితి

నేడు బలపడనున్న అల్పపీడనం - వర్షాలతో తెలంగాణలో 3 రోజులు ఎల్లో అలర్ట్, ఏపీలో ఇలా

నేడు బలపడనున్న అల్పపీడనం - వర్షాలతో తెలంగాణలో 3 రోజులు ఎల్లో అలర్ట్, ఏపీలో ఇలా

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డెంగీ కేసుల కలకలం, పదుల సంఖ్యలో నమోదు!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డెంగీ కేసుల కలకలం, పదుల సంఖ్యలో నమోదు!

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?