అన్వేషించండి

KCR Public Meeting: ఈ 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ.. ఏడాది తరువాత మళ్లీ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ బాస్!

BRS president KCR | తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల వేదికగా భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని తెలిసిందే.

హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్ర రాజకీయాలకు ఎప్పుడూ కేంద్రబిందువే. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సోమవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. దాదాపు ఏడాది తరువాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రేపు జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభలో 4 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీలో చేరికల్ని సూచిస్తుంది. ప్రస్తుతం ప్రజలు రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారు’ అని ఆయన పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ప్రచారానికి ఇదే నాంది..
‘కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని మేం ప్రకటించగా కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే రోజున కాళేశ్వరం సమీపంలోని ఒక ప్రాంతంలో సభను ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బహిరంగసభ హైలైట్ కావొద్దని, సభకు తగినంత మైలేజీ రాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అదే సమయానికి సభను నిర్వహిస్తోంది. రేపు జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ సభ తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి మా ప్రచారానికి నాంది పలుకుతుందని’ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు.

జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ గడ్డపై తన పట్టును మళ్లీ నిరూపించుకునేందుకు గులాబీ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పశ్చిమ ప్రాంతమైన జగిత్యాల జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. సుదీర్ఘ కాలం పాటు తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఈ సభలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ శ్రేణులకు నైతిక బలాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


KCR Public Meeting: ఈ 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ.. ఏడాది తరువాత మళ్లీ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ బాస్!

ఏడాది తరువాత కేసీఆర్ స్పీచ్.. ఎదురుచూస్తున్న ప్రజలు
గత ఏడాది నుంచి కొంత మౌనంగా ఉన్న కేసీఆర్ ఈ సభ వేదికగా కాంగ్రెస్ పాలనపై తనదైనశైలిలో విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు హాజరైన తరువాత మీడియాతో మాట్లాడి తమ వెర్షన్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల గడువు ముగియడం, సగం టర్మ్ ముగిసింది కనుక కేసీఆర్ జగిత్యాల వేదికగా గర్జిస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అధికారంలోకి రావడానికి ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తమ గ్రౌండ్ వర్క్ మొదలుపెడుతుందని చర్చ జరుగుతోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget