అన్వేషించండి

Bandi Sanjay real hero: ఆర్మీహెలికాఫ్టర్లను పిలిపించి ఐదుగురికి ప్రాణదానం - బండి సంజయ్ రియల్ హీరో - గ్రామస్తుల ప్రశంసలు

Bandi Sanjay: హుటాహుటిన రెండు హెలికాఫ్టర్లు తెప్పించి ఐదుగురి ప్రాణాలను కాపాడారు బండి సంజయ్ . రియల్ హీరో బండి సంజయ్ అని నర్మాల గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.

Bandi Sanjay real hero: : వరద ముంపులో ఇరుక్కున్న వారిని కాపాడేందుకు బండి సంజయ్ రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఆయన కష్టం వల్ల పలువురికి ప్రాణాలు దక్కాయి.  సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన 5 గురు వ్యక్తులను కాపాడేందుకు  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిన్నటి నుండి చేసిన కృషి ఫలించింది. ఆర్మీ హెలికాప్టర్లను ప్రత్యేకంగా రప్పించి బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడారు. దీంతో ప్రాణభయంతో వరదల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న బాధితులు క్షేమంగా బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర మంత్రి చేరుకోగానే క్షేమంగా బయటపడ్డ బాధితులు బండి సంజయ్ వద్దకు వచ్చి తమ ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు నర్మాల గ్రామస్థులతోపాటు అక్కడికి వచ్చిన జనమంతా బండి సంజయ్ ను ‘‘రియల్ హీరో’’ అంటూ అభివర్ణించారు. 
 
వరదల్లో గల్లంతైన నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య నివాసానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మనోధైర్యం కోల్పోవద్దని, అండగా ఉంటామని వారిని ఓదార్చారు. నాగం కుమారుడు సాయికి రూ.లక్ష ఆర్ధిక సాయం అందించారు. ధైర్యంగా ఉండాలంటూ భరోసా ఇస్తూ ముందుకు కదిలారు. నిన్నటి నుండి రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేసిన క్రుషి మరువలేనిదన్నారు. నర్మాలలో రెస్య్కూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దామోదర సింగ్ ను అభినందిస్తూ కేంద్ర మంత్రి శాలువాతో సన్మానించారు.
 
‘‘భారీ వర్షాలు, వరదలతో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నర్మాల వరదల్లో బాదితులు చిక్కుకుపోయారని తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరిన వెంటనే ఆర్మీ హెలికాప్టర్లను పంపారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో నిన్న రాలేకపోయాయి. ఈరోజు వర్షం కొద్దిసేపు తెరిపి ఇచ్చిన వెంటనే హెలికాప్టర్లు వచ్చి బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేశారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా లకు ధన్యవాదాలు. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు నిన్నటి నుండి కష్టపడి పనిచేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకించి ఆర్మీ చాపర్లను తెచ్చి బాధితుల ప్రాణాలు కాపాడిన రక్షణ శాఖ అధికారులకు అభినందనలు. ముఖ్యంగా ఎయిర్ కమాండర్ వీఎస్.శైని చేసిన క్రుషి అంతా ఇంతా కాదు. ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నా. ప్రస్తుతమున్న రెండు హెలికాప్టర్లతోపాటు అదనంగా మరో రెండు హెలికాప్టర్లు సిరిసిల్లకు వచ్చాయి. వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ టైంలో దయచేసి రాజకీయాలు వద్దు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరికాదు. బాధితులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తిగా సమన్వయంతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాం. ముఖ్యమంత్రి, మంత్రులతో నిరంతరం మాట్లాడుతూ పరిస్థితిని అంచనా వేస్తున్నాం.’’ అని తెలిపారు. 

 ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీలను ప్రత్యేకంగా అభినందించారు. నర్మాలకు వచ్చిన కేంద్ర మంత్రిని జిల్లా కలెక్టర్, ఎస్పీ కలిసి పరిస్థితిని వివరిస్తూ తీసుకుంటున్న సహాయ చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘‘జిల్లా కలెక్టర్, ఎస్పీ నిన్నటి నుండి కష్టపడి పనిచేస్తూనే ఉన్నారు. వీళ్లు లేకుంటే భయంతో బాధితులు ఏమైపోయేవారో. వాళ్లకు ఎప్పటికప్పుడు భరోసా ఇస్తూ వారికి అవసరమైన సాయం చేస్తూ ప్రాణాలు కాపాడిన వీరిద్దరికీ హ్యాట్సాఫ్’’అని అభినందించారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget