Sircilla Farmers Rescue Operation: తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన రెస్య్కూ ఆపరేషన్ - నర్మాల వద్ద వాగులో చిక్కుకున్న రైతులు సేఫ్
Sircilla Farmers Rescue Operation: వ్యవసాయం కోసం వాగుదాటి వెళ్లిన రైతులు వరద ప్రభావంతో తిరిగి ఒడ్డుకు చేరలేదు. వరద ఉద్దృతిలో చిక్కుకున్న రైతులను తీవ్ర ఉత్కంఠగా ఆపరేషన్ రెస్క్యూ సాగింది.

Sircilla Farmers Rescue Operation: సిరిసిల్లాలో వరద విలయతాండవం చేస్తోంది. గంభీరావుపేట మండలంలో నర్మాల వద్ద మానేరు వాగు ఉప్పొంగడంతో వ్యయసాయ పనులు కోసం ఉదయం వాగుదాటి వెళ్లిన ఐదుగురు రైతులు తిరిగి ఒడ్డుకు రాలేని పరిస్దితి నెలకొంది. ఎగువ ప్రాంతాలల నుంచి భారీగా చేరుతున్న వరద నీటితో మానేరు వాగు ఊహించని స్దాయిలో ఉప్పొంగడంతోపాటు గరిష్ట స్దాయి దాటి వరద ప్రవాహ తీవ్రత కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 80వేల క్యూసిక్‌లకు పైగా వరద నీరు మానేరు వాగులోకి చేరడంతోపాటు దిగువకు సైతం అంతేస్దాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. నిన్న వ్యవసాయ పనుల నిమిత్తం నర్మాల నుంచి మానేరు వాగుదాటి వ్యసాయ పనులకు వెళ్లిన రైతులు తిరిగి రాలేని పరిస్దితి నెలకొంది. స్దానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్దలానికి చేరకున్న అధికారులు రైతులను రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో నిన్నరాత్రి వరకూ అధికారుల చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, రైతులకు ఆహారం, తాగునీటిని డ్రోన్‌ల సహాయంతో పంపడంతోపాటు వారిలో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
ఓవైపు ఎడతెరిపి లేని భారీ వర్షాలు, మరోవైపు ఉగ్రరూపం దాల్చిన వాగు వరద తీవ్రత చూసిన రైతుల కుటుంబ సభ్యులలో ఆందోళన నెలకొంది. నిలువనీడలేక, రాత్రంతా నిద్రలేక రైతులు ఆరోగ్య పరిస్దితిపై భయం నెలకొంది. వాగు ఉద్ధృతి దాటి తిరిగి ప్రాణాలతో తమను చేరుకుంటారా లేదా అనే భయం కుటుంబ సభ్యులను వెంటాడుతోంది. ఇలా క్షణం క్షణం ఉత్కంఠగా మారింది నర్మాల వద్ద వరదలో చిక్కుకున్న ఐదుగురు రైతుల దుస్దితి. క్లాత్ బ్యాగ్‌లలో ఆహాాన్ని, నీటిని నిన్నటి నుంచి రైతులకు పంపుతూ, ఎన్డీఆర్ఎఫ్ టీమ్ రైతులను రక్షించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆర్మీ సిబ్బందికి సమారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈదురు గాలులతోపాటు భారీ వర్షాల ప్రభావంతో ఆర్మీ హెలికాప్టర్ కూడా వచ్చే అవకాశం లేకపోవవడంతో రైతుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర భయాందోళన నెలకొొంది.
మధ్యాహ్నం సమయానికి స్పాట్‌కు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ చేరుకోవడంతో రెస్య్కూ ఆపరేషన్ మొదలైంది. వాగు ఉద్ధృతి చిక్కున్న ఐదుగురు రైతల వద్దకు చేరుకుంది ఆర్మీ హెలికాఫ్టర్. రైతులను క్షేమంగా హెలికాప్టర్‌లో వాగు ఒడ్డుకు చేర్చారు ఆర్మీ సిబ్బంది. హెలికాఫ్టర్ దిగుతూ ఒక్కొక్కరుగా రైతులు తమ కుటుంబ సభ్యులను చేరుకోవడంతో గంటల తరబడి కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. జిల్లాలో అప్పటికే వరద ప్రవాహంలో ఓ రైతు కొట్టుకుపోయిన ఘటన నేపధ్యంలో, ఈ ఐదుగురు రైతులు క్షేమంగా వస్తారా, లేదా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.వాగుకు అవతలి వైపు ఎత్తైన కొండకు సమీపంలో చిక్కుకు పోయిన రైతుల వద్దకు చేరుకున్న హెలికాప్టర్ ,ఐదు రైతులను క్షేమంగా ఒడ్డుకు చేర్చింది. హెలికాప్టర్ దిగిన రైతులు, తమ కుటుంబ సభ్యలను హత్తుకుని బోరున విలపించారు. ప్రాణాలమీద ఆశ వదులకున్నాం. ఇలా ఒడ్డుకు చేరుతామని అనుకోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉంటే సిరిసిల్ల జిల్లాలో వరదల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వరదల‌్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు మరో రెండు హెలికాప్టర్‌ను సైతం జిల్లాకు పంపారు అధికారులు.





















