కరీంనంగర్‌లోని ప్రభుత్వం హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య- మృతిపై బంధువుల అనుమానం
Karimnagar News: కరీంనగర్ సమీపంలోని నగునూరులో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సాంఘీక సంక్షేమ కళాశలలో డిగ్రీ చదువుతున్న సృజన ఉరివేసుకొని చనిపోయింది.

Karimnagar News: కరీంనగర్ సమీపంలోని నగునూరులో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సాంఘీక సంక్షేమ కళాశలలో డిగ్రీ చదువుతున్న సృజన ఉరివేసుకొని చనిపోయింది. రాత్రి అందరితో కలిసి సరదాగా గడిపిన సృజన ఉదయం రోల్‌కాల్‌కు రాలేదు.
రోల్‌కాల్‌కు రాలేదని సృజన కోసం ఫ్రెండ్స్, సిబ్బంది వెతికారు. అన్ని రూములు వెతగ్గా తన క్లాస్‌రూమ్‌లోనే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిది. అది చూసిన ఫ్రెండ్స్ సిబ్బంది షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు, పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇంతలో పేరెంట్స్ కూడా వచ్చారు. ఆమె మృతిపై తమకు అనుమానం ఉందని అంటున్నారు.





















