Karimanagar News : టీఆర్ఎస్ సమావేశంలో జెడ్పీటీసీ కంటతడి, కేశిక్ రెడ్డితో విభేదాలే కారణమా?
Karimanagar News : కరీంనగర్ టీఆర్ఎస్ సమావేశంలో జెడ్పీ ఛైర్ పర్సన్ విజయ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కారణంగానే ఆమె కంటతటిపెడ్డినట్లు తెలుస్తోంది.
Karimanagar News : కరీంనగర్ టీఆర్ఎస్ సమావేశంలో జెడ్పీ ఛైర్ పర్సన్ విజయ కంటతడిపెట్టారు. కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఆ సమావేశానికి హాజరైన మంత్రి గంగుల కమలాకర్ ఆమెను సముదాయించి పక్కన కూర్చోబెట్టారు. ఆమె ఒకసారిగా ఎందుకు కన్నీటి పర్యంతమయ్యారో తెలియాల్సి ఉంది. అంతకు ముందు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పక్కన కూర్చొని అయనతో కొద్ది సేపు విజయ ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాత కొద్ది సేపటికే కన్నీళ్లు పెట్టుకున్నారు జెడ్పీ ఛైర్ పర్సన్. కొన్ని ప్రభుత్వ పథకాల విషయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తన మాట కొనసాగనీయడం లేదంటూ విజయ కంటతడి పెట్టుకున్నారని సమాచారం.
దళిత బంధు విషయంలో అడ్డంకులు
కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం స్టేజ్‌పైనే జడ్పీ ఛైర్మన్ కనిమెళ్ల విజయ కన్నీరు పెట్టుకోవడం కలకలం రేపుతోంది. స్టేజ్ పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితో కాసేపు మాట్లాడిన ఆయన ఏడుస్తూ మంత్రి గంగులకు తన బాధను తెలిపారు. జమ్మికుంటలో దళిత బంధు పథకానికి ఇచ్చిన భూమి విషయంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని జెడ్పీటీసీ ఆరోపించారు. విజయ కంటతడి పెట్టడంతో స్టేజ్ పైన ఉన్నవారంతా షాక్ అయ్యారు.
ఎమ్మెల్సీగా తృప్తి లేదు
ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీగా తనకు తృప్తి లేదన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే అయితేనే తృప్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ప్రజలు మరోసారి ఆలోచన చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ తనకు టికెట్ ఇస్తారని, మీకు చేతులెత్తి దండం పెడుతున్నా ఈసారి తనను గెలిపించాలని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
పార్టీ మార్పుపై పుట్టా మధు స్పందన
పార్టీ మార్పు ప్రచారం పై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు స్పందించారు. తాను సొంత పనుల కోసం మాత్రమే ఢిల్లీ వచ్చానని చెప్పారు. పార్టీలు మారుతున్నా అని... కొందరు తన పై ప్రచారం చేయడం బాధాకరంగా ఉందని అన్నారు. తాను కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని అని.. కేసీఆర్ తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని పుట్టామధు తెలిపారు. జిల్లా పరిషత్ కోసం పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. మంథనిలో తనకు పోటీ లేదని.. తాను భారీ మెజార్టీతో గెలవుతున్నానని పుట్టా మధు అన్నారు. తనకు వేరే పార్టీ మారే అవసరం లేదని చెప్పారు. పార్టీలో తనకు గుర్తింపు ఉందన్న ఆయన.. తన పేరు చెప్పి పంచాయతీలకు కోట్ల నిధులు విడుదల చేశారని తెలిపారు. అసలు ఢిల్లీ రావాలంటేనే భయం వేస్తోందన్నారు. సొంత పనుల కోసం ఢిల్లీ వస్తే ప్రతిష్టను దిగజార్చేలా పుకార్లు పుట్టిస్తున్నారని పుట్టా మధు ఆరోపించారు.
పుట్ట మధును దూరం పెడుతున్న టీఆర్ఎస్ హైకమాండ్
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఇటీవల సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఇతర నాయకులతో సమావేశం నిర్వహించారు. అయితే దీనికి పుట్ట మధుకు ఆహ్వానం అందలేదు దాంతో అలిగిన ఆయన వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని బీజేపీలో సంప్రదింపులు జరిపారని చెబుతున్నారు. దీనికితోడు ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలపై ఎప్పుడైనా ఈడీ రెయిడ్స్ జరగవచ్చనే అనుమానాలు ఉన్నాయి. టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఈటల రాజేందర్‌కు పుట్ట మధు సన్నిహితుడు. ఈ కారణంగానే ఆయన ఈటలతో కలిసి బీజేపీలోకి వెళ్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం జరిగిన లాయర్ వామన్‌రావు దంపతుల హత్య విషయంలోనూ పుట్ట మధుపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను ఈ నిందితుడు.