By: ABP Desam | Updated at : 02 Mar 2023 03:43 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
నిరసన కార్యక్రమంలో మంత్రి గంగుల
Minister Gangula : భారతదేశానికి మోదీ ప్రధాని కావడం దురదృష్టకరమని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి పేద మధ్య తరగతి ప్రజలపై ఊహించని భారాన్ని మోపిందన్నారు. ప్రధాని మోదీ మిత్రుడు అదానీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే ఈ ధరల పెంపు అని గంగుల కమలాకర్ ఆరోపించారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్.. గ్యాస్ సిలిండర్ కటౌట్లు, సిలిండర్లు, వంట వార్పుతో నిరసన వ్యక్తం చేశారు. మంత్రి గంగుల మాట్లాడుతూ...75 సంవత్సరాల స్వాతంత్ర్య దేశంలో సిలిండర్ పై ఒక ఏడాదికి 100 రూపాయలు పెంచిన ఘనత కేవలం ప్రధాని మోదీకే దక్కుతుందన్నరు. బీజేపీ అధికారంలోకి రాకముందు... 8 సంవత్సరాల క్రితం కేవలం 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు 1200 రూపాయలకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దేశ చరిత్రలో ఇంతగా ధరలు పెంచిన ప్రధాని ఎవరు లేరనీ, గడిచిన 8 సంవత్సరాలలో సిలిండర్ పై 800 రూపాయలు పెంచిన మహానుభావుడు ప్రధాని మోదీ అని అన్నారు.
సిలిండర్ ధర రూ.800 తగ్గించే వరకు ఉద్యమం ఆగదు
ధరల పెంపుపై మాత్రమే దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం... పేద మధ్యతరగతి ప్రజల బాధలను పట్టించుకోవడం లేదనీ, పెరిగిన ధరలను తగ్గించేందుకు చర్యలు కూడా తీసుకోవడం లేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. అదానీకి దోచి పెట్టేందుకు పేద మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపారన్నారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు... కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్నారన్నారు. తెలంగాణలో ఆకలికేకలు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ప్రధాని మోదీ పెట్రోల్, గ్యాస్, పప్పులు, నిత్యావసర ధరలు పెంచి దేశ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారని దుయ్యబట్టారు. గ్యాస్ సిలిండర్ ధరను 1200 నుంచి 800 రూపాయలకు తగ్గించాలని, అప్పటి వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ధరల పెంపు ఏ ఆడబిడ్డా ఒప్పకోదు
గ్యాస్ ధరల పెంపుపై ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డిల భార్యలతో పాటు ఏ ఆడబిడ్డ కూడా ఒప్పుకోదని మంత్రి గంగుల అన్నారు. పెరిగిన ధరలు తగ్గించే వరకు ఆడబిడ్డలు చేపట్టే ఉద్యమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఓవైపు సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటుంటే... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుపేద మధ్యతరగతి ప్రజల రక్తాన్ని పీలుస్తుందని మండిపడ్డారు. పెంచిన ధరలు తగ్గించే వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణీ- హరి శంకర్ ఇతర నేతలు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.
KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం
TSPSC Leaks What Next : ఓ వైపు లిక్కర్ కేసు - మరో వైపు పేపర్ లీకేజీ దుామరం ! కేసీఆర్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దబోతున్నారు ?
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయిన వర్షాలు, మళ్లీ 24, 25 తేదీల్లో కురిసే ఛాన్స్!
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా