అన్వేషించండి

Transgender Marriage : ప్రేమ కోసం పేరు మార్చుకుని, ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్న యువకుడు!

Transgender Marriage : కరీంనగర్ జిల్లాలో ఆదర్శ వివాహం జరిగింది. ఓ ట్రాన్స్ జెండర్ ను యువకుడు పెళ్లి చేసుకున్నాడు.

Transgender Marriage : ఎంతో వైరుధ్యం గల వ్యక్తులు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉన్న ఘటనల గురించి మనం విన్నాం. అలాంటి ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఆ ఇద్దరి చూపులు కలిశాయి, మనసులు ఒక్కటయ్యాయి. కలిసి జీవనం సాగించాలనుకున్నారు. మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు నడిచి నూతన జీవితంలోకి అడుగుపెట్టారు. ఇదేదో సాధారణ వ్యక్తులకు చెందిన వివాహం కాదు. ఓ ట్రాన్స్ జెండర్ ను వివాహం చేసుకున్న ఆ వ్యక్తి ఆమెకు బాసటగా నిలుస్తానని హామీ ఇచ్చాడు. కొత్త జీవితంలో తన జీవిత భాగస్వామితో ముందుకు సాగుతానని చెబుతున్నాడు.  కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో శుక్రవారం ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను వివాహం చేసుకున్నాడు. 

Transgender Marriage : ప్రేమ కోసం పేరు మార్చుకుని, ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్న యువకుడు!

హర్షిత్ గా మారిన అర్షద్ 

వీణవంకకు చెందిన దివ్య కొంత కాలంగా జమ్మికుంట పట్టణంలో జీవనం సాగిస్తుంది. జగిత్యాలలో నివాసం ఉన్నప్పుడు దివ్యకు అక్కడే ఉన్న అర్షద్ తో పరిచయం అయింది. అర్షద్ ఆమె పెళ్లి చేసుకుంటానని రెండు మూడు సార్లు ప్రపోజ్ చేశాడు. అయితే మొదట్లో నిరాకరించిన దివ్యను ఒప్పించేందుకు  గురువారం జమ్మికుంటకు వచ్చిన అర్షద్  హర్షిత్ గా మారి ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. దివ్య సర్జరీ కూడా చేయించుకున్న తరువాతే హర్షిత్ ప్రపోజల్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న హర్షిత్ తన పేరు మార్చుకుని  భార్య చెప్పినట్టుగా నడుచుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెబుతున్నాడు. వివాహ బంధంతో ఒక్కటైన తాము ఆదర్శవంతమైన జీవితం గడుపుతామని దివ్య పేర్కొంది. శుక్రవారం జమ్మికుంటలో ఒక్కటైన ఈ జంట ఇల్లంతకుంట రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అన్ని జంటలలాగే తాము ఆదర్శవంతంగా జీవిస్తామని అంటున్నారు. 

 అమెరికాలో పెళ్లి బాజాలు, అనంతలో భోజనాలు

ఆన్లైన్ సౌకర్యం పుణ్యమా అని అమెరికాలో జరిగిన పెళ్లిని అనంతవాసులు డిజిటల్ తెరపైన వీక్షించారు. అమెరికాలో పెళ్లి జరగగా వివాహ భోజనాలు మాత్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగాయి. వీసా సమస్యల కారణంగా పెళ్లి కుమార్తె ఇండియాకు రాలేకపోయింది. దీంతో తప్పని పరిస్థితులలో అమెరికాలో వధూవరులు నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్లందరూ అమెరికాలోనే పెళ్లి తంతు ముగించారు. ఆ పెళ్లిని అనంతపురం జిల్లా తాడిపత్రిలో డిజిటల్ స్క్రీన్స్ పై బంధుమిత్రులు వీక్షించారు. వధూవరులను దీవించి అనంతం పెళ్లి భోజనాలు చేశారు. తాడిపత్రి పట్టణానికి చెందిన రఘురాం రెడ్డి భాగ్యలక్ష్మిలా కుమారుడు కౌశిక్ కుమార్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కు చెందిన సుప్రియ రెడ్డి కూడా అమెరికాలోనే ఉద్యోగం చేస్తోంది. ఇరువురి పెద్దలు వీరిద్దరికి పెళ్లి నిశ్చయించారు. కానీ పెళ్లి కుమార్తెకు వీసా రెన్యువల్ కాకపోవడం, వరుణ్ తల్లిదండ్రులకు సరైన సమయంలో వీసా లభించకపోవడంతో సమస్య తలెత్తింది. అనుకున్న ముహూర్తానికి అమెరికాలోని కొంతమంది తెలుగు వారు ఈ వివాహానికి పెద్దలుగా వ్యవహరించారు. ఇక్కడున్న బంధుమిత్రులకు వివాహ వేడుకలను చూపించాలని అనుకున్న రఘురాం రెడ్డి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. తాడిపత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో భారీ డిజిటల్ తెరను ఏర్పాటు చేసి బంధుమిత్రులకు అమెరికాలో జరుగుతున్న వివాహ తంతును లైవ్ లో చూపించారు. సాంకేతికత పుణ్యమా అని ఎక్కడో అమెరికాలో జరిగిన వివాహాన్ని ఇక్కడ నుంచి చూడగలిగామంటూ బంధుమిత్రులందరూ ఆనందం వ్యక్తం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Revanth Reddy : మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Haryana Rohingya Connection: రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ -  హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ - హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
Embed widget