అన్వేషించండి

KA Paul: మోదీకి మందకృష్ణ మాదిగ రూ.72 కోట్లకు అమ్ముడుపోయారు - కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు 

KA Paul: భారత దేశాన్ని అవినీతి నుంచి రక్షించడం తనతోనే సాధ్యమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. పార్టీ సింబల్‌ గురించి ఎన్నికల సంఘాన్ని కలిశారు.

KA Paul Comments on Mandakrishna Madiga: భారత దేశాన్ని అవినీతి నుంచి రక్షించడం తనతోనే సాధ్యమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) అన్నారు. పార్టీ సింబల్‌ గురించి ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అన్నారు. ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగపై విమర్శలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి జరుగుతున్న దేశంగా ఇండియా మారిందని విమర్శించారు. 

అప్పుడు తిట్టారు.. ఇప్పుడు పొగుడుతున్నారా?
మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ప్రధాని మోదీకి (PM Modi) అమ్ముడు పోయారని విమర్శించారు. పరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టడానికి మందకృష్ణ మాదిగకు రూ. 72 కోట్లు ముట్టాయని ఆరోపించారు. మందకృష్ణను ప్రజా శాంతి పార్టీలో చేరమంటే రూ. 25 కోట్లు అడిగారని అన్నారు. గతంలో మోదీని ఘోరమైన తిట్లు తిట్టిన మందకృష్ణ మాదిగ.. ఇప్పుడు మోదీ దేవుడు అని అంటున్నారని మండిపడ్డారు. 

ఎవరికి ఓటు వేయొద్దు
ఒక ఎంపీ కోసం ఇస్తారని ప్రధాని మోదీకి మందకృష్ణ మాదిగ అమ్ముడు పోయారని అన్నారు. మాదిగలకు మోదీ ఇన్ని రోజులు చేయని న్యాయం ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్నించారు. మూడు పార్టీలకు ఓట్లు వేయొద్దని కోరారు. 30న ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోవాలన్నారు. కుటుంబ పాలన వద్దని, తమకు సింబల్ ఇవ్వనందుకు రేపు తెలంగాణ హైకోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. 

అదానీ అప్పులు మాఫీ చేశారు
ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు చెన్నూరు, జుక్కల్, వేములవాడ, ఉప్పల్, యాకుత్‌పురాతో పాటు 13 సెగ్మెంట్లలో పోటీలో ఉన్నట్లు కేఏ పాల్ చెప్పారు. మోదీ బీసీ కాదని, తన శిష్యుడని అన్నారు. నరేంద్ర మోదీ సర్టిఫికెట్లు అన్ని డూప్లికేట్ అని చెప్పారు. ప్రధానికి కేఏ  పాల్ భయపడడని, మోదీనే తనంటే భయపడతారని అన్నారు. అదాని అప్పులు కట్టకుండా మోదీ మాఫీ చేశారని ఆరోపించారు. 

ఎన్నికల అధికారులు వేధిస్తున్నారు
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తమ పార్టీ గుర్తు కేటాయించకుండా వేధిస్తున్నారని కేఏ పాల్ గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా శాంతి పార్టీ తరఫున సెప్టెంబర్లోనే అన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన ఇంతవరకు గుర్తు కేటాయించలేదని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ యాక్టివ్‌గా ఉందని కేఏ పాల్ చెప్పారు. కానీ పార్టీ యాక్టివ్‌గా లేదని చెప్తున్నారని అన్నారు.

ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ నడుపుతున్నారో, ఎన్నికల కమిషనర్ నడుపుతున్నాడో అర్థం కావడంలేదని ఆయన విమర్శించారు. పోటీ చేయని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కూడా గుర్తు కేటాయించారని, కానీ మాకు మాత్రం కేటాయించ లేదన్నారు. 

గుర్తు ఏంటని అడుగుతున్నారు?
ప్రజా శాంతి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తే సింబల్ ఏంటి అని ప్రశ్నించారని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తనకు ఎందుకు ఇంతలా నరకం చూపిస్తున్నారో అర్థం కావడం లేదని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సింబల్ కోసం నిరాహారదీక్ష చేయ్యాలా? అంటూ ప్రశ్నించారు. హెలికాప్టర్, రింగ్ గుర్తుల్లో ఏది కేటాయించారో చెప్పడం లేదని, ఆరు నెలలుగా ఇస్తున్నామని చెప్తున్నారే తప్ప కేటాయించడం లేదని మండిపడ్డారు. 

తక్షణమే ప్రజా శాంతి పార్టీకి గుర్తు వెంటనే కేటాయించాలని పాల్ డిమాండ్ చేశారు. నామినేషన్లకు మరో రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. ప్రజా శాంతి పార్టీకి సింబల్ ఎందుకు ఇవ్వడం లేదో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. మ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Embed widget