అన్వేషించండి

Jeevan Reddy meets KCR: అన్నా.. దేవుడే నన్ను మీ దగ్గరికి పంపిండు - కేసీఆర్ వద్ద జీవన్ రెడ్డి భావోద్వేగం

BRS: కేసీఆర్ ను జీవన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కలిసి పని చేయడానికి దేవుడే పంపించాడని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

Jeevan Reddy meets KCR in Farmhouse: తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ మలుపు చోటుచేసుకుంది. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ మంత్రి, సీనియర్ నేత ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.  శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు.  

జీవన్ రెడ్డి భావోద్వేగం

కేసీఆర్‌ను కలిసిన సమయంలో జీవన్  రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.  తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అన్నా.. అందుకే దేవుడే నన్ను మీ దగ్గరికి పంపిండు  అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ పాత మిత్రుడితో కలిసి ప్రయాణించే అవకాశం రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గతంలో 2014లోనే కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.   

 ఆత్మీయ ఆలింగనం.. విందు భేటీ 

జీవన్ రెడ్డి రాకతో ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో సందడి నెలకొంది. తన పాత మిత్రుడిని కేసీఆర్ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆయనను హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుని, పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు. అనంతరం ఇద్దరు నేతలు కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు. జగిత్యాల రాజకీయాలతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత జీవన్ రెడ్డి బృందంతో కలిసి కేసీఆర్ భోజనం చేశారు. 

 కాంగ్రెస్‌కు భారీ దెబ్బ 

నిజానికి గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడం, పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న జీవన్ రెడ్డి వంటి మేధావి పార్టీలోకి రావడం బీఆర్ఎస్‌కు కొండంత అండని  ఆ పార్టీ వర్గాలుచెబుతున్నాయి. 

తెలంగాణ పునర్నిర్మాణం కోసమే..

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కనుమరుగవుతున్నాయని, అభివృద్ధి కుంటుపడుతోందని జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సుస్థిరంగా ఉండాలన్నా, రైతులు సంతోషంగా ఉండాలన్నా మళ్లీ కేసీఆర్ నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాలో తనకంటూ ప్రత్యేక అనుచరగణం ఉన్న జీవన్ రెడ్డి చేరికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ మరింత పటిష్టం కానుంది. రాబోయే రోజుల్లో ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget