DA for RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదల, జనవరి 1 నుంచి అమల్లోకి
Ponnam Prabhakar | తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ డీఏ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు.

TGRTC Employees | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఏకైక కరువు భత్యాన్ని (DA) విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ 2.1 శాతం పెంపుతో, ఉద్యోగుల మొత్తం డీఏ 52.8 శాతానికి చేరుకుంది.
జనవరి నుంచి చెల్లించాల్సిన ఈ పెండింగ్ డీఏ బకాయిలను భవిష్యత్తులో రాబోయే మూడు నెలల కాలంలో, ప్రతి నెలా కొంత చొప్పున విడతల వారీగా విడుదల చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.
ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏ ను ప్రభుత్వం విడుదల చేసింది..
— Ponnam Prabhakar (@Ponnam_INC) April 10, 2026
జనవరి 2026 నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వచ్చింది... దీంతో సవరించిన డీఏ వల్ల 52.8 శాతానికి చేరింది..
జనవరి నుండి ఇవ్వాల్సిన పెండింగ్ డీఏ లు భవిష్యత్ లో వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో… pic.twitter.com/4rGoOrJojL
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం తార్నాక ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయడం, కారుణ్య నియామకాలు చేపట్టడం, గతంలో వివిధ కారణాలతో తొలగించబడిన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి విధుల్లోకి తీసుకోవడం వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా, పని భారం తగ్గించేందుకు కొత్త నియామకాలు మరియు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సుల కొనుగోలు వంటి కార్యక్రమాలతో సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తోందన్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















