Disha Sajjanar : కీలక దశకు దిశ నిందితుల ఎన్ కౌంటర్ విచారణ.. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఎదుటకు సజ్జనార్..!
నాటి సైబరాబాద్ కమిషనర్, నేటి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దిశ ఎన్‌కౌంటర్ విషయంలో సుప్రీకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. మరోసారి కూడా ఆయన వారి ఎదుటహాజరయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జస్టిస్ సిర్ఫూర్కర్ కమిషన్ ముందు హాజరయ్యారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ అంశంపై జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణ జరుపుతోంది. దిశ ఎన్ కౌంటర్ సమయంలో సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నారు. ఆయనను ప్రశ్నించేందుకు జస్టిస్ సిర్పూర్కక్ నోటీసులు ఇచ్చింది. గత బుధవారమే విచారణ జరగాల్సి ఉంది. కానీ వాయిదా పడింది. ఆయనను సోమవారం హాజరు కావాలని ఆదేశించడంతో హాజరయ్యారు. మంగళవారం కూడా ఆయనను కమిషన్ సభ్యులు ప్రశ్నించే అవకాశం ఉంది.
అప్పుల బాధతో విషం తాగి తండ్రి ఆత్మహత్య.. నాన్న తాగింది కూల్ డ్రింక్ అనుకుని చిన్నారులూ..
2019 నవంబర్‌లో హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో నిందితులు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్‌కౌంటర్‌పై విచారణకు సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ పలు దఫాలుగా బాధిత కుటుంబాలను కలిసి విచారించింది. అలాగే నాడు ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన పోలీసులు, పంచనామా చేసిన మేజిస్ట్రేట్ సహా పలువురు అధికారులను ప్రశ్నించింది. ఆ ఘటన జరిగిన తర్వాత ఎన్‌కౌంటర్ స్పాట్‌ను పరిశీలించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులను కూడా ప్రశ్నించింది.
Also Read: East Godavari Crime: గంజాయి రవాణాలో కొత్త దారులు.... బోర్ వెల్ లారీలో రూ.2 కోట్ల గంజాయి పట్టివేత...
ఎన్‌కౌంటర్ జరిగిన చోట మృతదేహాలు పడి ఉన్న తీరును ప్రత్యక్షంగా వెళ్లినా ఎన్‌హెచ్‌ఆర్సీ ఎలాంటి వివరాలు నమోదు చేయలేదు. ఎన్‌కౌంటర్‌లో పోలీసులు ఎక్కడి నుంచి కాల్పులు జరిపారనే విషయాలు ఘటనా స్థలంలో సేకరించలేదు. పోలీసులు చెప్పిన విషయాలను మాత్రమే నమోదు చేసుకున్నారు. ఈ అంశంపై ఎన్‌హెచ్ఆర్సీ సభ్యులపై సిర్పూర్కర్ కమిషన్ అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
Also Read: Chittor Rape: 80 ఏళ్ల బామ్మపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం.. అనంతరం బాలికపై మరో రేప్‌నకు యత్నం
దిశ కేసు విచారణాధికారులందర్నీ జస్టిస్ సిర్పూర్కర్ కమిటీ ఇప్పటికే పరశ్నించింది. సిట్ ఇన్‌ఛార్జి సురేందర్‌రెడ్డి... హోంశాఖ కార్యదర్శి నుంచి అదనపు వివరాలు తీసుకుంది. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితుల కుటుంబసభ్యులను కూడా పిలిచించి వాంగ్మూలాలు తీసుకున్నారు. అంతిమంగా అసలు దిశ కేసులో నిందితులు వాళ్లే అనడానికి ఎలాంటి ఆధారాలున్నాయో కూడా సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. అలాగే దిశ హత్యాచారం, ఎన్‌కౌంటర్‌పై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్‌గా మహేశ్ భగవత్‌ను నియమించింది. ఆయన ఇప్పటికే పలుమార్లు కమిషన్ ముందు హాజరయ్యారు. అనేక విషయాలను ఆయన కమిషన్‌కు వివరించారు. సజ్జనార్ విచారణ తర్వాత కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
Also Read: Hyderabad Accident: నిశ్చితార్థం జరిగింది..త్వరలోనే ఓ ఇంటివారుకానున్నారు...కానీ ఇంతలోనే....