అన్వేషించండి

Hyderabad News: బయటి ఫుడ్ తింటున్నారా? - చికెన్‌లో పురుగు, దోశలో బొద్దింక - ఇవి చూస్తే నిజంగా షాక్

Food Poison: స్విగ్గీలో చికెన్ ఆర్డర్ పెట్టిన వ్యక్తి అందులో పురుగును చూసి షాకయ్యాడు. అటు, దోశలో బొద్దింకను చూసిన వ్యక్తి ప్రశ్నించగా హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.

Insects In Dosa And Chicken Fry In Hyderabad: రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు పానీపూరీ, ఛాట్ వంటి బయటి ఫుడ్‌ను చాలామంది ఇష్టంగా తింటుంటారు. అయితే, తాజాగా బయట కొన్న ఆహారాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు తరచూ వింటున్నాం. ఇటీవలే ఓ హోటల్‌లోని ఇడ్లీలో బొద్దింక కనిపించిన ఘటన సంచలనం రేపింది. తాజాగా, ఓ వ్యక్తి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్న చికెన్ ఫ్రైలో పురుగు కనిపించడం కలకలం రేపింది. అలాగే, మరో చోట హోటల్‌లో దోశ తింటుండగా అందులో బొద్దింక ప్రత్యక్షమైంది. బాధిత వినియోగదారులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ నుంచి అనిరుథ్ అనే వ్యక్తి స్విగ్గీలో చికెన్ ఫ్రై, చికెన్ న్యూడిల్స్, మెజిస్టిక్స్ ఆర్డర్ చేశారు. ఫుడ్ డెలివరీ తీసుకుని వాటిని ఓపెన్ చేసి తింటుండగా పురుగును చూసి షాకయ్యారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సదరు హోటల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

దోశలో బొద్దింక

అటు, సోమాజీగూడ యశోద ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఓ హోటల్‌లో రాఘవేంద్ర కుమార్ అనే వ్యక్తి దోశ తింటుండగా బొద్దింక ప్రత్యక్షమైంది. దీన్ని చూసిన వెంటనే అతను షాక్‌కు గురై హోటల్ నిర్వాహకులను ప్రశ్నించాడు. అయితే, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సదరు హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కాగా, ఇటీవలే నగరంలో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందగా 20 మంది అస్వస్థతకు గురయ్యారు. సాధ్యమైనంత వరకూ బయటి ఫుడ్ తినొద్దని.. ఒకవేళ తిన్నా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: VC Sajjanar: 'దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం?' - ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పోస్ట్ వైరల్, కట్ చేస్తే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Best Budget CNG Cars: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Best Budget CNG Cars: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Top Mobile Launches of 2024: 2024లో మనదేశంలో లాంచ్ అయిన బెస్ట్ స్మార్ట్ ఫోన్లు - యాపిల్ నుంచి రెడ్‌మీ వరకు!
2024లో మనదేశంలో లాంచ్ అయిన బెస్ట్ స్మార్ట్ ఫోన్లు - యాపిల్ నుంచి రెడ్‌మీ వరకు!
Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Embed widget